కూట సాహిత్యం
ఉద్దేశపూర్వకంగా తప్పుడు వివరాలతో వెలువరించబడ్డ సాహిత్యం / From Wikipedia, the free encyclopedia
కూట సాహిత్యం అంటే పాఠకులను మోసగించేందుకు గానూ తప్పుడు మౌలిక వివరాలు ఇవ్వబడ్డ రచనలు. ఇవి ముఖ్యంగా రెండు రకాలు. మొదటి రకంలో ఒక రచనను ఎవరైనా ఒక పెద్ద రచయిత వ్రాసినట్లుగానో, లేక ఒక కల్పిత వ్యక్తిని దాని రచయితగానో చెప్పగా, రెండో రకంలో కొన్ని కల్పిత కథలను రచయిత తన సొంత అనుభవాలుగా సమాజాన్ని నమ్మింపజూడటం జరుగుతుంటుంది.
ప్రముఖ ప్రవాసాంధ్ర తెలుగు రచయిత వేలూరి వేంకటేశ్వర రావు ఈమాటలో గ్రంథచౌర్యంపై వ్రాసిన వ్యాసంలో కూట సృష్టిని గ్రంథచౌర్యంలో ఒక రకంగా పరిగణించాడు.[1]