టెస్ట్ క్రికెట్ మైదానాల జాబితా
From Wikipedia, the free encyclopedia
1877 మార్చిలో మెల్బోర్న్లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ల మధ్య అధికారికంగా గుర్తింపు పొందిన మొదటి టెస్టు మ్యాచ్ జరిగినప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు నూట ఇరవై ఒక్క మైదానాల్లో టెస్టు క్రికెట్ ఆడారు.[1] ఆయా మైదానాల్లో టెస్టు క్రికెట్ మొదట ఆడిన తేదీ వారీగా ఈ మైదానాల జాబితాను కింద చూడవచ్చు. ఈ జాబితాలో వరల్డ్ సిరీస్ క్రికెట్ వేదికలను చేర్చలేదు.
2009 జూలై 8 న, కార్డిఫ్‌లోని సోఫియా గార్డెన్స్ 100 వ టెస్టు వేదిక అయింది.[2][3] 2019 నవంబరులో ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్ మధ్య జరిగిన మ్యాచ్‌తో భారతదేశంలోని ఎకానా క్రికెట్ స్టేడియం అత్యంత తాజా వేదికగా (121వది) నిలిచింది.[1]