దేశాల జాబితా – తలసరి కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్
From Wikipedia, the free encyclopedia
వివిధ ఇంధనాల దహనం వల్ల కార్బన్ డయాక్సైడ్ వాయువు వాతావరణంలోకి వెలువడుతుంది. దీనినే కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు అంటారు. వాతావరణంలో సమతుల్యత దెబ్బ తినడానికీ, భూగోళం ఉష్ణోగ్రత పెరగడానికీ, ఓజోన్ కవచం క్షీణించడానికీ ఇది ముఖ్యమైన కారణం. తలసరి వారీగా వివిధ దేశాల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు వివరాలు (List of countries by carbon dioxide emissions per capita) ఈ జాబితాలో ఉన్నాయి.
అయితే కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు అనేది ఒక విధంగా ఆయా దేశాల పారిశ్రామిక ప్రగతిని కూడా సూచిస్తుంది.
ఈ జాబితా 1990-2203 మధ్య కాలంలో ఉద్గారాలు లెవెల్‌ను సూచిస్తుంది. వివరాలు 'అమెరికా ఎనర్జీ డిపార్ట్మెంట్' గణాంకాలనుండి తీసుకొనబడ్డాయి. US Department of Energy - Carbon Dioxide Information Analysis Center) - ఐక్య రాజ్య సమితి గణాంకాల విభాగం కొరకు ఈ వివరాలు కూర్చబడ్డాయి. వివరాలు లభించని దేశాలకు అంచనాలు ఇవ్వడమైనది. 2003 కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు ప్రకారం ర్యాంకులు ఇవ్వబడ్డాయి.