దేశాల జాబితా - ఖండాల ప్రకారం
From Wikipedia, the free encyclopedia
దేశాల జాబితా - ఖండాల ప్రకారం (List of countries by continent): ఇది ప్రపంచంలోని ఖండాల వారీగా వివిధ దేశాల జాబితా. ప్రతి దేశానికీ ఆ దేశం జాతీయ పతాకం, ఆదేశం పేరు (ఆంగ్ల అకారాది క్రమంలో), రాజధాని నగరం పేరు ఇవ్వబడ్డాయి.
- ఈ జాబితాలో చేర్చినవి.
- స్వాధిపత్య రాజ్యాలు -జాబితాలో:
- ఐక్య రాజ్య సమితిలో సభ్యులుగా ఉన్న దేశాలు.
- సభ్యులుగా కాకపోయినా గాని ఐ.రా.స. చేత గుర్తింపబడినవి.: వాటికన్ నగరం .
- ఐ.రా.స. చేతా, చాలా మంది ఐ.రా.స. సభ్యుల చేతా గుర్తింపబడకపోయినా గాని చాలా దేశాలతో దాదాపు పూర్తి అంతర్జాతీయ సంబంధాలు కలిగి ఉన్నది. చైనా గణతంత్రం (తైవాన్) .
- స్వతంత్ర దేశాలు కానప్పటికీ చాలా ఐ.రా.స. సభ్య దేశాలచేత "స్వాధిపత్యానికి అర్హమైనవి" గా గుర్తింపబడినవి రెండు - పాలస్తీనా భూభాగాలు, పశ్చిమ సహారా
- అధీన భూభాగాలు - ఫ్రాన్స్ ఓవర్సీస్ డిపార్ట్మెంట్ అధీన భాగాలు, పీపుల్స్ గణతంత్రం ఆఫ్ చీనా ప్రత్యేక పాలనా ప్రాంతం.
అయితే దాదాపు స్వాతంత్ర్యం కలిగి ఉన్నా గాని గుర్తింపు లేని దేశాలు ఈ జాబితాలో కలుపబడలేదు.
ఐక్య రాజ్య సమితి గణాంకాల విభాగం అనుసరించిన విధానం ఈ జాబితాలోని వర్గీకరణకు వాడబడింది.
[1]
కొన్ని దేశాలు భౌగోళిక లేదా చారిత్రిక లేదా రాజకీయ అంశాల కారణంగా ఖండాంతర దేశాలు ' అని పరిగణింప బడుతున్నాయి.