ప్రవాస భారతీయులు
గణతంత్ర భారతదేశం వెలుపల 6 నెలలకు పైగా నివసించే భారతీయ జననం, సంతతి లేదా మూలం ఉన్న వ్యక్తులు / From Wikipedia, the free encyclopedia
విదేశాల్లో నివసిస్తున్న భారతీయులను ప్రవాస భారతీయులు అని అంటారు. ఇంగ్లీషులో నాన్-రెసిడెంట్ ఇండియన్స్ (ఎన్ఆర్ఐ) అనీ లేదా పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (పిఐఓ) అనీ పిలుస్తారు. వారు రిపబ్లిక్ ఆఫ్ ఇండియా వెలుపల నివసించే భారతీయ సంతతికి చెందిన లేదా భారతీయ మూలాలున్న వ్యక్తులు. విదేశాంగ మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం, 3.2 కోట్ల ప్రవాస భారతీయులు ఉన్నారు. [1] ప్రపంచవ్యాప్తంగా ఉన్న వలస జనాభాలో 5.5 కోట్ల మందితో భారతీయ మూలాలున్నవారే అత్యధికులు. [2]