ఫాతిమా బేగం
భారతీయ సినిమా నటి, దర్శకురాలు, స్క్రీన్ ప్లే రచయిత్రి / From Wikipedia, the free encyclopedia
ఫాతిమా బేగం (1892–1983) ఒక భారతీయ సినిమా నటి, దర్శకురాలు, స్క్రీన్ ప్లే రచయిత్రి. భారతీయ సినిమా మొదటి మహిళా చిత్ర దర్శకురాలిగా పరిగణించబడుతోంది.[1] నాలుగు సంవత్సరాలలో ఆమె అనేక చిత్రాలకు రచయిత్రిగా, నిర్మాతగా, దర్శకురాలిగా వ్యవహరించింది. ఫాత్మా ఫిల్మ్స్ పేరుతో స్వంత నిర్మాణ సంస్థని కూడా ప్రారంభించింది, అది తరువాత విక్టోరియా-ఫాత్మా ఫిల్మ్స్‌గా మార్చబడింది. 1926లో బుల్బుల్-ఎ-పరిస్థాన్ అనే సినిమాకు మొదటిసారి దర్శకత్వం వహించింది.[2][3]
త్వరిత వాస్తవాలు ఫాతిమా బేగం, జననం ...
ఫాతిమా బేగం | |
---|---|
జననం | 1892 భారతదేశం |
మరణం | 1983 (aged 90–91) భారతదేశం |
వృత్తి | సినిమా నటి, దర్శకురాలు, స్క్రీన్ ప్లే రచయిత్రి |
జీవిత భాగస్వామి | నవాబ్ సిదీ ఇబ్రహీం ముహమ్మద్ యాకుత్ ఖాన్ III |
పిల్లలు | 3, జుబేదా, సుల్తానా, షెహజాదీ |
బంధువులు | రియా పిళ్లై (ముని మనవరాలు) |
మూసివేయి