బోత్సువానా
From Wikipedia, the free encyclopedia
బోత్సువానా దీనిని అధికారికంగా రిపబ్లిక్ ఆఫ్ బోత్సువానా అంటారు. దక్షిణఫ్రికా స్థానికులు మాట్లడే భాషలలో ఒకటైన త్స్వానా భాషలో దీనిని లెఫత్షి లా బోత్సువానా అంటారు. ఇది దక్షిణాఫ్రికా దేశాలలో ఒకటి. ఇక్కడి పౌరుల చేత బాత్సువానా అని పిలువబడింది. వాత్సవంగా ఇది బ్రిటిష్ ప్రొటెక్రేట్ అఫ్ బెచ్యుయానాలాండ్గా గుర్తించబడింది. 1966 సెప్టెంబరు 30న ఈ దేశానికి కామన్వెల్త్ దేశాల నుండి స్వతంత్రం లభించిన తరువాత ఈ దేశానికి బోత్సువానా అనే నామంతరం చేసుకున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఇక్కడ స్వతంత్రమైన చక్కని స్వేచ్ఛా పూరితమైన ఎన్నికలు నిర్వహించారు. బోత్సువానా సమతల ప్రదేశం ఉన్న దేశం. 70% దేశ సరిహద్దులను కలహరి ఎడారి చుట్టి ఉంటుంది. బోత్సువానా దక్షిణ సరిహద్దు, ఆగ్నేయ సరిహద్దులలో దక్షిణాఫ్రికా ఉంది. పడమటి, ఉత్తర సరిహద్దులలో నమీబియా ఉంటుంది. ఉత్తర సరిహద్దులలో జింబాబ్వే ఉంటుంది. బోత్సువానా తూర్పు భాగములో స్వల్పముగా కొన్ని వందల మీటర్ల సరిహద్దులలో జాంబియా ఉంటుంది. బోత్సువానా మధ్యంతర పరిమాణము కలిగిన భూపరివేష్టిత (లాండ్ లాక్) దేశము. బోత్సువానా జనసంఖ్య 2,000,000. స్వతంత్రం రాక పూర్వము బోత్సువానా ఆఫ్రికా దేశాలలో అతి బీద దేశం. బోత్సువానా జిడిపి అప్పుడు 0.75 అమెరికా డాలర్లు మాత్రమే ఉండేది. స్వతంత్రం వచ్చిన తరువాత బోత్సువానా స్వశక్తితో శీఘ్రంగా అభివృద్ధి సాధించిన కారణంగా త్వరితగతిన అభివృద్ధి చెందిన ప్రపంచ దేశాలలో ఒకటిగా అంతర్జాతీయ గుర్తింపు పొందింది. 2010 అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంచనా ప్రకారము బోత్సువానా సరాసరి తలసరి అదాయము 14,000 అమెరికా డాలర్లు. బోత్సువానా సంపూర్ణ స్వతంత్ర విధానాలను అనుసరిస్తున్నది.
లిఫత్షె లొ బోత్సువానా రిపబ్లిక్ ఆఫ్ బోత్సువానా |
||||||
---|---|---|---|---|---|---|
నినాదం " పుల " " రెయిన్(వాన) " |
||||||
జాతీయగీతం ఫాత్సె లెనొ ల రొన బ్లెస్డ్ బి దిస్ నోబుల్ లాండ్ |
||||||
రాజధాని | గెబరోన్ 24°40′S 25°55′E | |||||
అతి పెద్ద నగరం | రాజధాని | |||||
అధికార భాషలు | ఆంగ్లము, త్సువానా& ఎన్ బి ఎస్ పి ;(national) | |||||
ప్రభుత్వం | పార్లమెంటరీ రిపబ్లిక్ | |||||
- | ప్రెసిడెంట్ | ఫెస్టస్ మొగె | ||||
ఇండిపెండెన్స్ | యునైటెడ్ కింగ్డమ్ నుండి | |||||
- | తేది | 30 సెప్టెంబర్ 1966 | ||||
విస్తీర్ణం | ||||||
- | మొత్తం | 581,726 కి.మీ² (41వ) 224,606 చ.మై |
||||
- | జలాలు (%) | 2.5 | ||||
జనాభా | ||||||
- | 2006 అంచనా | 1,639,833 (147th) | ||||
- | జన సాంద్రత | 3.0 /కి.మీ² (220th) 7.8 /చ.మై |
||||
జీడీపీ (PPP) | 2006 అంచనా | |||||
- | మొత్తం | $18.72 బిలియన్ (114th) | ||||
- | తలసరి | $11,400 (60th) | ||||
జినీ? (1993) | 63 (high) | |||||
మా.సూ (హెచ్.డి.ఐ) (2004) | 0.570 ( మధ్యమం ) (131st) | |||||
కరెన్సీ | పుల (బి వి పి ) |
|||||
కాలాంశం | సి ఎ టి (UTC+2) | |||||
- | వేసవి (DST) | నాట్ అబ్సర్వ్డ్ (UTC+2) | ||||
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | . బిడబ్ల్యు | |||||
కాలింగ్ కోడ్ | +267 |