వృత్తము
From Wikipedia, the free encyclopedia
వృత్తము జ్యామితి అనే గణిత శాస్త్ర విభాగానికి చెందిన ఒక భావన.
మరింత సమాచారం వృత్తము ...
వృత్తము | |
---|---|
తలం | ద్విమితీయం |
నిర్వచనం | ఒకస్థిరబిందువు నుండి సమాన దూరంలోగల బిందుపథం |
వ్యాసము | కేంద్రంగుండాపోవు జ్యా |
వ్యాసార్థము | వ్యాసంలో సగభాగం |
ఆంగ్ల పదం | circle |
వృత్త పరిధి | వృత్త పరిధి = π(వ్యాసము) |
మూసివేయి
ఒక సమతలంలోని ఇవ్వబడిన ఒక బిందువు నుండి సమాన దూరంలో ఉన్న బిందువుల సమితిని వృత్తము అంటారు.అనగా ఒక స్థిర బిందువు నుండి సమాన దూరంలో గల బిందు పథం.ఒక వృత్తం అది ఉండేసమ తలాన్ని మూడు బిందు సమితులుగా విభజిస్తుంది.
- వృత్త బాహ్య బిందువుల సమితి.(వృత్త బాహ్యము)
- వృత్తం మీది బిందువుల సమితి.(వృత్తము)
- వృత్తం అంతర బిందువుల సమితి.(వృత్త అంతరము)