హిందూస్తాన్ టైమ్స్
భారతీయ ఆంగ్ల భాషా దినపత్రిక. / From Wikipedia, the free encyclopedia
హిందూస్తాన్ టైమ్స్ అనేది భారతీయ ఆంగ్ల భాషా దినపత్రిక. ఇది ఢిల్లీ కేంద్రంగా ప్రచురించబడుతోంది. కెకె బిర్లా కుటుంబానికి చెందిన హెచ్.టి. మీడియాకు సంబంధించిన ప్రధాన ప్రచురణ, శోభనా భర్తియా యాజమాన్యంలో ఉంది.[2][3][4]
'ఫస్ట్ వాయిస్. లాస్ట్ వర్డ్. | |
రకం | దినపత్రిక |
---|---|
రూపం తీరు | బ్రాడ్షీట్ |
యాజమాన్యం | హెచ్.టి. మీడియా లిమిటెడ్ |
ప్రధాన సంపాదకులు | సుకుమార్ రంగనాథన్ |
ప్రారంభించినది | 1924; 100 సంవత్సరాల క్రితం (1924) |
భాష | ఆంగ్లం |
కేంద్రం | 18–20 కస్తూర్బా గాంధీ మార్గ్, న్యూ ఢిల్లీ 110001, భారతదేశం |
దేశం | భారతదేశం |
Circulation | 1,072,966 రోజూ[1] (as of 2019 డిసెంబరు) |
సోదరి వార్తాపత్రికలు | హిందుస్తాన్ దైనిక్ మింట్ |
ISSN | 0972-0243 |
OCLC number | 231696742 |
అకాలీ ఉద్యమం, శిరోమణి అకాలీదళ్ వ్యవస్థాపకుడు సుందర్ సింగ్ లియాల్‌పురి ఢిల్లీలో దీనిని స్థాపించాడు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో జాతీయవాద దినపత్రికగా ముఖ్యభూమిక పోషించింది.[5][6]
భారతదేశంలో సర్క్యులేషన్ ప్రకారం హిందూస్థాన్ టైమ్స్ అనేది అతిపెద్ద వార్తాపత్రికలలో ఒకటి. ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్ ప్రకారం 2017 నవంబరు నాటికి 993,645 కాపీల సర్క్యులేషన్‌ను కలిగి ఉంది. ఇండియన్ రీడర్షిప్ సర్వే 2014 ప్రకారం, టైమ్స్ ఆఫ్ ఇండియా తర్వాత భారతదేశంలో అత్యధికంగా చదివే రెండవ ఆంగ్ల వార్తాపత్రిక హిందూస్థాన్ టైమ్స్ అని తెలిపింది.[7] న్యూ ఢిల్లీ, ముంబై, లక్నో, పాట్నా, రాంచీ, చండీగఢ్ నుండి ఏకకాల ఎడిషన్లతో ఉత్తర భారతదేశంలో అత్యధికంగా ప్రసిద్ధి చెందింది.
నాగ్‌పూర్ ముద్రణ ప్రదేశం 1997 సెప్టెంబరులో, జైపూర్ 2006 జూన్ లో నిలిపివేయబడింది. హిందూస్థాన్ టైమ్స్ 2004లో హిందూస్థాన్ టైమ్స్ నెక్స్ట్ అనే యువ దినపత్రికను ప్రారంభించింది. కోల్‌కతా ఎడిషన్ 2000 ప్రారంభంలో, ముంబై 2005 జూలై 14న ప్రారంభించబడింది. హిందూస్తాన్ టైమ్స్ ఇతర ప్రచురణలు మింట్ (ఇంగ్లీష్ బిజినెస్ డైలీ), హిందుస్తాన్ (హిందీ డైలీ), నందన్ (నెలవారీ పిల్లల పత్రిక), కాదంబని (నెలవారీ సాహిత్య పత్రిక) ఉన్నాయి. పిల్లల కోసం ప్రత్యేక సంచిక ఉంది. ఫీవర్ 104.0 ఎఫ్ఎం అనే రేడియో ఛానెల్‌ని కూడా కలిగి ఉంది. విద్యకు సంబంధించిన సంస్థ, స్టడీమేట్, వార్షిక లగ్జరీ కాన్ఫరెన్స్‌ను నిర్వహిస్తుంది.