రామదాసు
సుప్రసిద్ధ వాగ్గేయకారుడు / From Wikipedia, the free encyclopedia
భద్రాచల రామదాసు గా ప్రసిద్ధి పొందిన ఇతని అసలు పేరు కంచెర్ల గోపన్న. 1620 లో, ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో లింగన్నమూర్తి, కామాంబ దంపతులకు జన్మించాడు[1]. వీరి భార్య కమలమ్మ. ఈయన శ్రీరాముని కొలిచి, కీర్తించి, భక్త రామదాసు గా సుప్రసిద్ధుడైనాడు. భద్రాచల దేవస్థానమునకు, ఇతని జీవిత కథకు అవినాభావ సంబంధము. తెలుగులో కీర్తనలకు ఆద్యుడు. దాశరథీ శతకము, ఎన్నో రామ సంకీర్తనలు, భద్రాచలం దేవస్థానము - ఇవన్నీ రామదాసు నుండి తెలుగు వారికి సంక్రమించిన పెన్నిధులు. ఇతని గురువు శ్రీ రఘునాథ భట్టాచార్యులు. (కబీర్ దాసు గారు రామదాసునకు తారక మంత్రముపదేశించిరని కూడా ఒక కథ యున్నది).
రామదాసు పేరుతో ఇతర వ్యాసాలున్నాయి. వాటి లింకుల కోసం రామదాసు (అయోమయ నివృత్తి) చూడండి. |
త్వరిత వాస్తవాలు భద్రాచల రామదాసు, జననం ...
భద్రాచల రామదాసు | |
---|---|
జననం | కంచెర్ల గోపన్న 1620 నేలకొండపల్లి , ఖమ్మం జిల్లా |
నివాస ప్రాంతం | నేలకొండపల్లి , ఖమ్మం జిల్లా |
ఇతర పేర్లు | భక్త రామదాసు |
వృత్తి | తహసిల్దారు(పాల్వంచ పరగణా) |
ఉద్యోగం | తహసిల్దారు |
ప్రసిద్ధి | భక్త రామదాసు |
మతం | హిందూ |
భార్య / భర్త | కమలమ్మ |
పిల్లలు | రఘునాధ |
తండ్రి | లింగన్నమూర్తి |
తల్లి | కామాంబ |
మూసివేయి