కృష్ణ (2008 సినిమా)
From Wikipedia, the free encyclopedia
కృష్ణ, 2008 జనవరిలో విడుదలైన ఒక తెలుగు సినిమా. ఆ సంవత్సరం సంక్రాంతి సందర్భంగా విడుదలైన సినిమాలలో ఇది బాగా విజయవంతమైనదిగా పేరు పొందింది. రవితేజ సినిమా రంగంలో ముఖ్యనాయకునిగా నిలద్రొక్కుకోవడానికి ఈ సినిమా దోహదం చేసింది. అంతకుముందు రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యంలో అనేక సినిమాలు రాగా ఇది హైదరాబాదు, విజయవాడ గ్యాంగుల నేపథ్యంలో చిత్రీకరింపబడింది.
త్వరిత వాస్తవాలు దర్శకత్వం, నిర్మాణం ...
కృష్ణ (2008 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | వి.వి. వినాయక్ |
---|---|
నిర్మాణం | బి. కాశీవిశ్వనాధం, డి.వి.వి. దానయ్య |
రచన | వి.వి. వినాయక్ ఆకుల శివ |
తారాగణం | రవితేజ త్రిష గిరిబాబు సాయాజీ షిండే ముకుల్ దేవ్ బ్రహ్మానందం |
సంగీతం | చక్రి |
ఛాయాగ్రహణం | ఛోటా కె. నాయుడు |
కూర్పు | గౌతంరాజు |
విడుదల తేదీ | జనవరి 12, 2008 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
పెట్టుబడి | 4 కోట్లు. |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
మూసివేయి