తెలుగు అక్షరాలు
తెలుగు భాషకు చెందిన అక్షరాలు / From Wikipedia, the free encyclopedia
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం తెలుగు భాష (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2).
వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు. చిన్నయ సూరి బాల వ్యాకరణం ప్రకారం దేశ్యమైన తెలుగుభాషకు వర్ణాలు ముప్ఫై ఆరు (36).
తెలుగు వర్ణ సముదాయమును మూడు భాగాలుగా విభజించవచ్చును.