బాబు (కార్టూనిస్ట్)
From Wikipedia, the free encyclopedia
బాబు తెలుగులో మంచి వ్యంగ్య చిత్రకారులలో ఒకడు. "బాబు" కలం (కుంచె) పేరు. అసలు పేరు కొలను వెంకట దుర్గాప్రసాద్. ఇతని కార్టూన్లను 1963 సంవత్సరం నుండి మొదలు పెట్టి పుంఖాను పుంఖాలుగా అన్ని ప్రముఖ పత్రికల్లోను ప్రచురించారు. ఇతని కార్టూన్లు ఆంధ్రపత్రికలో మొదట ప్రచురించబడ్డాయి. తరువాత్తరువాత, స్వాతి పత్రిక ప్రచురించబడుతున్నాయి. ఇతను వ్యంగ్య చిత్రాలను చిత్రించటమే కాకుండా కథానికల రచయిత కూడా. ఆపైన, వార పత్రికలలో ప్రచురితమయ్యే కథలు, కథానికలు, శీర్షికలు, ధారావాహికలకు చక్కటి అర్ధవంతమయిన చిత్రాలను గీస్తుంటారు.
త్వరిత వాస్తవాలు కొలను వెంకట దుర్గాప్రసాద్, జననం ...
కొలను వెంకట దుర్గాప్రసాద్ | |
---|---|
జననం | కొలను వెంకటదుర్గాప్రసాద్ (1946-06-01)1946 జూన్ 1 కృష్ణా జిల్లా విజయవాడ |
మరణం | 2019 అక్టోబరు 3(2019-10-03) (వయసు 73) |
నివాస ప్రాంతం | విజయవాడ |
ఇతర పేర్లు | బాబు |
వృత్తి | కార్టూనిస్ట్, పదవీ విరమణ చేసిన ఉద్యోగి |
భార్య / భర్త | శాంతకుమారి |
పిల్లలు | కళ్యాణ్ చక్రవర్తి, వేణు |
తండ్రి | కొలను సత్యనారాయణ |
తల్లి | కొలను పిచ్చమ్మ |
మూసివేయి