ముహమ్మద్ అన్వర్ ఎల్-సాదత్ (1918 డిసెంబరు 25 - 1981 అక్టోబరు 6) ఈజిప్టు రాజకీయ నాయకుడు, సైనిక అధికారి. ఆయన 1970 అక్టోబరు 15 నుండి 1981 అక్టోబరు 6న ఛాందసవాద సైనిక అధికారులచే హత్య చేయబడే వరకు ఈజిప్టు మూడవ అధ్యక్షుడిగా పనిచేశాడు. 1952లో జరిగిన ఈజిప్టు విప్లవంలో కింగ్ ఫరూక్‌ను తొలగించిన ఫ్రీ ఆఫీసర్స్‌లో ఆయన సీనియర్ సభ్యుడు. ప్రెసిడెంట్ గమల్ అబ్దేల్ నాసర్‌కి ఆయన అత్యంత సన్నిహితుడే కాక రెండుసార్లు ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు. అంతేకాకుండా, 1970లో ఆయన అధ్యక్షుడిగా విజయం సాధించాడు. 1978లో, ఆయన, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి మెనాచెమ్ బెగిన్ యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ జిమ్మీ కార్టర్‌తో కలిసి శాంతి ఒప్పందంపై సంతకం చేశారు, దీనికిగాను వారిని నోబెల్ శాంతి బహుమతితో సత్కరించబడ్డారు.

త్వరిత వాస్తవాలు అన్వర్ సాదత్, 3వ ఈజిప్ట్ అధ్యక్షుడు ...
అన్వర్ సాదత్
أنور السادات
Thumb
1980లో అన్వర్ సాదత్
3వ ఈజిప్ట్ అధ్యక్షుడు
In office
1970 అక్టోబరు 15  1981 అక్టోబరు 6
యాక్టింగ్: 1970 సెప్టెంబరు 28 – 1970 అక్టోబరు 15
ప్రధాన మంత్రి
See list
    • మహ్మద్ ఫౌజీ
    • అజీజ్ సెడ్కి
    • అన్వర్ సాదత్
    • అబ్ద్ ఎల్ అజీజ్ ముహమ్మద్ హెగాజీ
    • మమ్‌దౌ సేలం
    • ముస్తఫా ఖలీల్
    • అన్వర్ సాదత్
ఉపాధ్యక్షుడు
See list
    • అలీ సబ్రీ
    • మహ్మద్ ఫౌజీ
    • హోస్నీ ముబారక్
అంతకు ముందు వారుగమాల్ అబ్దెల్ నాసర్
తరువాత వారుసూఫీ అబూ తలేబ్
హోస్నీ ముబారక్
37వ ఈజిప్ట్ ప్రధాన మంత్రి
In office
1980 మే 15  1981 అక్టోబరు 6
అధ్యక్షుడుఅన్వర్ సాదత్
అంతకు ముందు వారుముస్తఫా ఖలీల్
తరువాత వారుహోస్నీ ముబారక్
In office
1973 మార్చి 26  1974 సెప్టెంబరు 25
అధ్యక్షుడుఅన్వర్ సాదత్
అంతకు ముందు వారుఅజీజ్ సెడ్కి
తరువాత వారుఅబ్ద్ ఎల్ అజీజ్ ముహమ్మద్ హెగాజీ
ఈజిప్ట్ వైస్ ప్రెసిడెంట్
In office
1969 డిసెంబరు 19  1970 అక్టోబరు 14
అధ్యక్షుడుగమాల్ అబ్దెల్ నాసర్
అంతకు ముందు వారుహుస్సేన్ ఎల్-షఫీ
తరువాత వారుఅలీ సబ్రీ
In office
1964 ఫిబ్రవరి 17  1964 మార్చి 26
అధ్యక్షుడుగమాల్ అబ్దెల్ నాసర్
అంతకు ముందు వారుహుస్సేన్ ఎల్-షఫీ
తరువాత వారుజకారియా మొహిద్దీన్
నేషనల్ అసెంబ్లీ ఆఫ్ ఈజిప్ట్ స్పీకర్
In office
1960 జులై 21  1969 జనవరి 20
అధ్యక్షుడుగమాల్ అబ్దెల్ నాసర్
అంతకు ముందు వారుఅబ్దేల్ లతీఫ్ బోగ్దాది
తరువాత వారుమొహమ్మద్ లబీబ్ స్కోకీర్
వ్యక్తిగత వివరాలు
జననం
ముహమ్మద్ అన్వర్ ఎల్-సాదత్
محمد أنور السادات

(1918-12-25)1918 డిసెంబరు 25
మోనుఫియా, ఈజిప్ట్ సుల్తానేట్
మరణం1981 అక్టోబరు 6(1981-10-06) (వయసు 62)
కైరో, ఈజిప్ట్
మరణ కారణంహత్య
రాజకీయ పార్టీనేషనల్ డెమోక్రటిక్ పార్టీ
ఇతర రాజకీయ
పదవులు
అరబ్ సోషలిస్ట్ యూనియన్
జీవిత భాగస్వామి
సంతానం7
కళాశాలఅలెగ్జాండ్రియా విశ్వవిద్యాలయం
సంతకంThumb
Military service
Allegianceఈజిప్ట్
Branch/serviceరాయల్ ఈజిప్షియన్ సైన్యం
ఈజిప్టు ఈజిప్టు సైన్యం
Years of service1938–1952
Rank కల్నల్ (యాక్టివ్)
ఫీల్డ్ మార్షల్ (హానరరీ)
మూసివేయి

అధ్యక్షుడిగా పదకొండు సంవత్సరాలు చేసిన ఆయన ఈజిప్ట్ పథాన్ని మార్చాడు. బహుళ పార్టీ వ్యవస్థను తిరిగి స్థాపించాడు. ఇన్ఫితా ఆర్థిక విధానాన్ని ప్రారంభించాడు. అధ్యక్షుడిగా, అతను 1967 ఆరు రోజుల యుద్ధం నుండి ఇజ్రాయెల్ ఆక్రమించిన ఈజిప్ట్ యొక్క సినాయ్ ద్వీపకల్పాన్ని తిరిగి పొందడానికి 1973 యోమ్ కిప్పూర్ యుద్ధంలో ఈజిప్ట్‌కు నాయకత్వం వహించాడు, 1967 ఆరు రోజుల యుద్ధంలో ఇజ్రాయెల్ ఆక్రమించిన ఈజిప్ట్ కు చెందిన సినాయ్ ద్వీపకల్పాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు 1973 యోమ్ కిప్పూర్ యుద్ధంలో ఆయన అధ్యక్షుడిగా ఈజిప్టుకు నాయకత్వం వహించాడు. ఇది ఆయన్ని ఈజిప్ట్‌లో హీరోగా నిలిపింది. ఆయన ఇజ్రాయెల్‌తో చర్చలు జరిపి, ఈజిప్ట్-ఇజ్రాయెల్ శాంతి ఒప్పందాన్ని కుదిర్చాడు. దీంతో ఆయనకు మెనాచెమ్ నోబెల్ శాంతి బహుమతి వరించింది. అన్వర్ సాదత్ మొదటి ముస్లిం నోబెల్ గ్రహీతగా నిలిచాడు.

మరోపక్క, సినాయ్ ఈజిప్ట్‌కు తిరిగి రావడం ఈజిప్షియన్లలో అనుకూలమైనదే అయినప్పటికీ,[2] ఆ దేశంలో ముస్లిం బ్రదర్‌హుడ్, వామపక్షాలు దీనిని తిరస్కరించాయి, పాలస్తీనా రాజ్యాన్ని నిర్ధారించే ప్రయత్నాలను ఆయన విరమించుకున్నాడని భావించారు. సుడాన్ మినహా, అరబ్ దేశాలు, పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ (PLO) అరబ్ దేశాలతో ముందస్తు సంప్రదింపులు లేకుండా ఇజ్రాయెల్‌తో ప్రత్యేక శాంతిని నెలకొల్పడానికి ఆయన చేసిన ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకించాయి. పాలస్తీనా సమస్యపై వారితో రాజీపడేందుకు ఆయన నిరాకరించిన కారణంగా 1979 నుండి 1989 వరకు అరబ్ లీగ్ నుండి ఈజిప్ట్ సస్పెండ్ కు గురయ్యాడు.

1981 అక్టోబరు 6న, కైరోలో జరిగిన కవాతు సందర్భంగా ఖలీద్ ఇస్లాంబౌలీ నేతృత్వంలోని తీవ్రవాదులు ఆటోమేటిక్ రైఫిల్స్‌తో ఆయనపై కాల్పులు జరిపి హతమార్చారు. ఈ హత్యకు దారితీసిన ప్రాథమిక అంశాలలో శాంతి ఒప్పందం కూడా ఒకటి.

మూలాలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.