అల్లూరి సీతారామరాజు
బ్రిటిషు పాలకులను ఎదిరించి సాయుధ పోరాటం చేసిన మన్యం ప్రాంత విప్లవ వీరుడు / From Wikipedia, the free encyclopedia
అల్లూరి సీతారామరాజు, (1897 జూలై 4 - 1924 మే 7) భారత స్వాతంత్ర్య చరిత్రలో ఒక మహోజ్వల శక్తి. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు. కేవలం 27 ఏళ్ళ వయసులోనే నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులు అయిన అనుచరులతో, చాలా పరిమిత వనరులతో బ్రిటీషు సామ్రాజ్యమనే మహా శక్తిని ఢీకొన్నాడు.
త్వరిత వాస్తవాలు అల్లూరి సీతారామరాజు, జననం ...
అల్లూరి సీతారామరాజు | |
---|---|
జననం | (1897-07-04)1897 జూలై 4 |
మరణం | 1924 మే 7(1924-05-07) (వయసు 26) |
మరణ కారణం | కాల్చివేత |
సమాధి స్థలం | కృష్ణదేవుపేట, ఆంధ్రప్రదేశ్ |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | 1922 రంప పితూరీ |
బిరుదు | మన్యం వీరుడు |
మూసివేయి