ఆంటిగ్వా అండ్ బార్బుడా
From Wikipedia, the free encyclopedia
ఆంటిగ్వా, బార్బుడా అనేవి కరేబియన్ సముద్రంలో ఉత్తర దక్షిణ అమెరికా ఖండాలకు మధ్య ఉన్న రెండు ద్వీపాల కలిగిన దేశం. ఇది కరేబియన్ సముద్రం, అట్లాంటిక్ సముద్రం మద్యన ఉంది. ఇందులో ఉత్తర అమెరికా ఖండానికి చెందిన 'ఆంటిగ్వా, బార్బుడా అనే రెండు మానవనివాసిత ద్వీపాలు, పలు ఇతర ద్వీపాలు (గ్రేట్ బర్డ్స్, గ్రీన్, గునియా, లాంగ్, మైదెన్, యోర్క్ ఐలాండ్ దక్షిణతీరంలో రెడోండా ) ఉన్నాయి. ఇవి బ్రిటీష్ పాలన నుండి 1981 నవంబరు 1 వ తేదిన స్వతంత్రం పొందినవి. ఇవి పూర్వం బ్రిటీష్ వెస్ట్ ఇండీస్ లో భాగముగా ఉండేవి. వీటి వైశాల్యం : 442 చదరపు కిలోమీటర్లు, జనాభా : 2011 గణాంకాల ఆధారంగా శాశ్వత పౌరసత్వం కలిగిన ప్రజల సంఖ్య 81,799, రాజధాని, పెద్ద నగరం : సెయింట్ జాన్స్ (ఆంటిగ్వా ద్వీపం) కరెన్సీ : ఈస్టరన్ కరేబియన్ డాలర్, భాషలు : ఇంగ్లీష్, పటోయిస్, మతం : క్రైస్తవము. వ్యవసాయం ప్రధాన వృత్తి. పంచదార, ప్రత్తి ప్రధాన ఎగుమతులు. పర్యాటకం ప్రధాన పరిశ్రమ.
Antigua and Barbuda | |
---|---|
నినాదం: "Each Endeavouring, All Achieving" | |
గీతం: Royal anthem: God Save the Queena | |
రాజధాని | St. John's 17°7′N 61°51′W |
అధికార భాషలు | English |
జాతులు (1996) | 89% Black 4.4% Mixed 2.4% White 2.5% Other |
పిలుచువిధం | Antiguan Barbudan |
ప్రభుత్వం | Parliamentary democracy under constitutional monarchy |
• Monarch | Elizabeth II |
• Governor-General | Rodney Williams |
• Prime Minister | Gaston Browne |
శాసనవ్యవస్థ | Parliament |
• ఎగువ సభ | Senate |
• దిగువ సభ | House of Representatives |
Independence | |
• Associated State | 27 February 1967 |
• from the United Kingdom | 1 November 1981 |
విస్తీర్ణం | |
• మొత్తం | 440 కి.మీ2 (170 చ. మై.) (195th) |
• నీరు (%) | negligible |
జనాభా | |
• 2014 estimate | 91,295 (199th) |
• 2011 census | 81,799 |
• జనసాంద్రత | 186/చ.కి. (481.7/చ.మై.) |
GDP (PPP) | 2016 estimate |
• Total | $2.159 billion[1] |
• Per capita | $23,922[1] |
GDP (nominal) | 2016 estimate |
• Total | $1.332 billion[1] |
• Per capita | $14,753[1] |
హెచ్డిఐ (2014) | 0.783[2] high · 58th |
ద్రవ్యం | East Caribbean dollar (XCD) |
కాల విభాగం | UTC-4 (AST) |
వాహనాలు నడుపు వైపు | left |
ఫోన్ కోడ్ | +1-268 |
ISO 3166 code | AG |
Internet TLD | .ag |
|
ఒకదానికొకటి కొన్ని నాటికల్ మైళ్ళదూరంలో ఉన్న ఆంటిగ్వా, బార్బుడా దీవులు " లీవార్డ్ ద్వీపాలు " మద్య ఉన్నాయి.ఇవి సుమారుగా భూమద్యరేఖకు 17 డిగ్రీల ఉత్తర అక్షాంశంలో ఉన్నాయి. 1493లో " క్రిస్టోఫర్ కొలంబస్ " ఈద్వీపాలను కనుగొని వీటికి సెవెల్లే కాథడ్రల్ లోని " వర్జిన్ ఆఫ్ లా ఆణ్టిగ్వా " గౌరవార్ధం ఈ పేరు నిర్ణయించాడు. దేశానికి " లాండ్ ఆఫ్ 365 బీచెస్ " అనే ముద్దుపేరు ఉంది.ఈదేశం పాలన, భాష తీవ్రమైన బ్రిటిష్ సామ్రాజ్యం ప్రభావం ఉంది. ఇది గతంలో బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది.