తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని పాతబస్తీ మధ్యలో ఉన్న చెరువు. From Wikipedia, the free encyclopedia
ఉందా సాగర్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని పాతబస్తీ మధ్యలో ఉన్న చెరువు. ఇది, రంగారెడ్డి జిల్లాలోని శంషాబాదు సమీపంలో ఉన్నా ఉందానగర్ ఉంది. హైదరాబాదులోని నాలుగు చెరువుల్లో (షామీర్పేట్ చెరువు, మీర్ ఆలం చెరువు, హుస్సేన్ సాగర్, ఉందా సాగర్) ఒకటైన ఈ చెరువు, 275 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది.[1]
ఉందా సాగర్ | |
---|---|
ప్రదేశం | హైదరాబాదు, భారతదేశం |
అక్షాంశ,రేఖాంశాలు | 17°17′37″N 78°27′25″E |
హైదరాబాదు నిజాం కాలంలో నిర్మించబడిన ఈ చెరువు, 1954లో హైదరాబాదు నగరానికి 8 మైళ్ళ దూరంలో ఉన్నట్లు తెలుపబడింది.[2] అయితే, హైదరాబాదు నగర పట్టణీకరణ కారణంగా పాతబస్తీలోని భూమి కనుమరుగైపోవడంతోపాటు ఈ చెరువు విస్తీర్ణం కూడా క్రమక్రమంగా తగ్గుతోంది.[3]
సర్వే ఆఫ్ ఇండియా తీసిన పటాలు, ఉపగ్రహ చిత్రాల ప్రకారం, ఉంది సాగర్ చెరువు, సుమారు 30 కాలువలతో పహాడి షరీఫ్ నుండి తలబ్ కట్ట వరకు విస్తరించి ఉంది.
చెరువులోని కొన్ని భాగాలలో చిత్తడినేలలు, నీటి మొక్కలు, రాళ్ళు ఉండడంతో ఇందులోకి ఈతకోసం దిగిన వాళ్ళకు ప్రమదాలు జరుగుతున్నాయి. అనుభవజ్ఞులైన ఈతగాళ్ళు కూడా చెరువు లోపల కాళ్ళు చిక్కుకుంటే తప్పించుకోలేరు. ఈత రానివాళ్ళు ఈ చెరువులో మునిగి చనిపోతున్నారు.[4]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.