ఏలగిరి
From Wikipedia, the free encyclopedia
ఏలగిరి, తమిళనాడులో 2019 లో ఏర్పాటు చేసిన తిరుపత్తూరు జిల్లా లోని కొండ విడిది (హిల్ స్టేషన్) స్థలం. వాణియంబాడి- తిరుపత్తూరు రోడ్డుకు దగ్గరలో ఉంది. ఇది 30 చ. కిలో మీటర్ల విస్తీర్ణంతో సముద్ర మట్టం నుండి 1110.6 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ కొండలు పచ్చని లోయలు, పూల తోటలు, పండ్ల తోటలతో నిండి ఉంటాయి. బెంగుళూరు నుండి సొంత వాహనములో ప్రయాణము చేయాలనుకుంటే ఉదయం 4 గంటలకి బయలుదేరునట్లు ప్లాన్ చేసుకుంటే ఉదయం 9 గంటలకల్లా క్రిష్ణగిరి మీదుగా ఇక్కడికి చేరుకోవచ్చును. ఇక్కడ ఎన్నో ఆహ్లాదపరిచే రిసార్ట్లు, బోటింగ్, షూటింగ్ లాంటి వినోద క్రీడలు ఉన్నాయి. జలపాతాలను కూడా సందర్శించి సాయంత్రం 4 గంటలకు తిరుగు ప్రయాణం కావచ్చు. తిరుపతి నుండి బెంగుళూరు రైలు మార్గాన ప్రయాణించువారు ఈ ఏలగిరి కొండలను దూరం నుంచి గమనించవచ్చు.
త్వరిత వాస్తవాలు ఏలగిరి ఏలగిరి కొండలు, దేశం ...
ఏలగిరి
ఏలగిరి కొండలు | |
---|---|
కొండ విడిది ప్రాంతం | |
Coordinates: 12.578104°N 78.640737°E / 12.578104; 78.640737 | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తమిళనాడు |
జిల్లా | తిరుపత్తూరు |
Elevation | 1,110.6 మీ (3,643.7 అ.) |
Demonym | ఏలగిరివాసులు |
భాషలు | |
• ఆధికారిక భాష | తమిళం |
Time zone | UTC+05:30 (భారత ప్రామాణిక కాలమానం) |
మూసివేయి