కరీంనగర్
తెలంగాణ, కరీంనగర్ జిల్లా లోని నగరం / From Wikipedia, the free encyclopedia
కరీంనగర్, తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లాలోని ఒక నగరం. ఇది ఒక ప్రధాన పట్టణ సముదాయం, కరీంనగర్ జిల్లాకు ప్రధాన పరిపాలనా కేంద్రం, రాష్ట్రంలో ఐదవ అతి పెద్ద నగరం. కరీంనగర్ మునిసిపల్ కార్పోరేషన్ చేత పాలించబడుతుంది.[4][5] ఇది గోదావరి ఉపనది అయిన మానేర్ నది ఒడ్డున ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఇది రాష్ట్రంలో మూడవ అతిపెద్ద, వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణం.[6] ఇది తెలంగాణ ఉత్తర జిల్లాలకు ప్రధాన విద్యా, ఆరోగ్య కేంద్రంగా పనిచేస్తుంది.[7] గ్రానైట్, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు విస్తృతంగా ప్రసిద్ధి చెందడంవల్ల దీనిని "సిటీ ఆఫ్ గ్రానైట్స్" అని కూడా పిలుస్తారు.[8][9]
కరీంనగర్ | |
---|---|
పట్టణం | |
Nickname: గ్రానైట్స్ నగరం | |
Coordinates: 18°26′13″N 79°07′27″E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | కరీంనగర్ |
ప్రాంతం | దక్కను |
స్థాపితం | 1905 |
Named for | సయ్యద్ కరీముల్లా షా ఖాద్రి |
Government | |
• Type | మ్యునిసిపల్ కార్పొరేషన్ |
• Body | కరీంనగర్ నగరపాలక సంస్థ |
• మేయర్ | సునీల్ రావు (తెలంగాణ రాష్ట్ర సమితి) |
Area | |
• పట్టణం | 40.50 km2 (15.64 sq mi) |
• Rank | 5th (state) |
Elevation | 275 మీ (902 అ.) |
Population | |
• పట్టణం | 2,97,447 |
• Rank | 178వ (భారతదేశం) 5వ (తెలంగాణ) |
• Density | 7,300/km2 (19,000/sq mi) |
• Metro | (SUDA) |
Demonym | కరీంనగరీయులు |
భాషలు | |
• అధికార | తెలుగు, ఉర్దూ |
Time zone | UTC+5:30 (భా.ప్రా.స) |
పిన్కోడ్ | 505001 to 505010 |
టెలిఫోన్ కోడ్ | 91-878 |
ISO 3166 code | IN-TG |
Vehicle registration | TS–02 / AP-15 (పాత సంఖ్య)[3] |
లింగ నిష్పత్తి | 981.4 ♀/♂ |
అక్షరాస్యత | 89.9 |
ప్లానింగ్ ఏజెన్సీ | శాతవాహన పట్టణ అభివృద్ధి సంస్థ |
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అభ్యర్థన మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్లాగ్షిప్ స్మార్ట్ సిటీస్ మిషన్ కింద స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయాల్సిన వంద భారతీయ నగరాల్లో ఇది ఒకటిగా ఎంపికైంది.[10]