From Wikipedia, the free encyclopedia
కశ్యపుడు ప్రజాపతులలో ముఖ్యుడు.కశ్యపుడు 'ఆకారాత్ కూర్మ' అని శతపథ బ్రాహ్మణంలో ఉంది. అంటే, ఈయన ఆకారం కూర్మం లేదా తాబేలు అని భావించవచ్చు. 'కశ్యపం' అంటే తాబేలు అని అర్థం. అథర్వ వేదంలో కశ్యపుడు, కాలంలోంచి పుట్టాడని ఉంది. అంటే, అతనికి ముందు ఎవ్వరూ లేరనీ, అతను ప్రప్రథమ మానవుడనీ అర్థం.
ఇప్పుడు మనమున్నది వైవస్వత మన్వంతరం. దీనికి వివస్వతుడు మనువు. ఈ వివస్వత మనువుకు తండ్రి కశ్యపుడు
వాల్మీకి రామాయణం ప్రకారం బ్రహ్మ కొడుకు.
పురాణాలు పేర్కొన్న అత్యంత ప్రాచీనమైన ఋషులలో ఒకరు కశ్యపుడు. కశ్యపుని పేరు మీదుగానే కాశ్మీర దేశానికి ఆ పేరు వచ్చిందని చెబుతారు. స్వారోచిష మన్వంతర కాలంలోనే కశ్యప మహముని జీవించి ఉన్నట్టు. పురాణాలు చెబుతాయి.
ఇతనికి ఇరవైఒక్క మంది భార్యలు. వీరిలో దితి, అదితి, వినత, కద్రువ, సురస, అరిష్ట, ఇల, ధనువు, సురభి, చేల, తామ్ర, వశ, ముని మొదలైనవారు దక్షుని కుమార్తెలు.
ఇతనికి బ్రహ్మ విషానికి విరుగుడు చెప్తాడు. పరశురాముడు ఇతనికి భూమినంతా దానం చేస్తాడు. ఇతనికి అరిష్టనేమి అనే పేరుంది.
1. ఒక ప్రజాపతి. ఇతఁడు మరీచికి కళవలన పుట్టినవాఁడు.శ్రావణ శుద్ధ పంచమి హస్తా నక్షత్రంతో కూడి ఉన్నపుడు కశ్యప మహర్షి జయంతిని ఆచరిస్తారు ఈయన దక్షప్రజాపతి కొమార్తెలలో పదుమువ్వురను, వైశ్వానరుని కొమార్తెలలో ఇరువురితో వివాహము అయ్యెను. అందు-
దక్ష ప్రజాపతి తనకు గల మరో 27మంది కుమార్తెలను (అశ్వని నుంచి రేవతివరకూ గల 27 నక్షత్రాలు) చంద్రుడికి ఇచ్చి వివాహం చేశాడు. మరో కుమార్తె అయిన సతీదేవి పరమ శివుడిని వివాహమాడింది. ఈ బంధుత్వరీత్యా విధంగా కశ్యపునికి ఈశ్వరుడు, చంద్రుడు తోడల్లుళ్లు అవుతారు. Archived 2019-07-20 at the Wayback Machine కశ్యప సంతానం
కశ్యపుడు తన వివిధ భార్యలతో అనేకమంది బిడ్డలను కన్నాడు. ఆ వివరాలు ఇవి:
1. దితి 2. అదితి 3. దను 4. కష్ట 5.అరిష్ట 6. సురస 7. ఇళ 8. ముని 9. క్రోధావసు 10. తమ్ర 11. సురభి 12. సరమ 13. తిమి అనే భార్యలు ఉన్నారని అంటారు. ఇక్కడకూడా 13 మందే భార్యలు అయినప్పటికీ, ఇందులో కొన్ని పేర్లు వేరుగా ఉన్నాయనేది గమనార్హం.
అలాగే, మత్స్య పురాణం ప్రకారమే, కశ్యపునికీ తమ్రకూ 6గురు కుమార్తెలు జన్మించారు. వారు : సుఖి, సేని, భాసి, గృధి, సుచి, సుగ్రీవి.
వీరివల్ల కూడా భూమిమీద సృష్టి జరిగింది. సుఖి చిలుకలు, గుడ్లగూబలకు; సేని గద్దలకు; గృధి రాబందులు, పావురాలకు; సుచి హంసలు, కొంగలు, బాతులకు; సుగ్రీవి గొర్రెలు, గుర్రాలు, మేకలు, ఒంటెలవంటి వాటికీ జన్మను ఇచ్చాయి.
వీరు కాకుండా కాశ్యపునికి ఆవత్సర, అసిత అనే ఇద్దరు కుమారులూ ఉండేవారు. ఆవత్సర వల్ల నైద్రువ, రేభ అనే కుమారులు, అసిత వల్ల శాండిల్య అనే కుమారుడు జన్మించారు
వైశ్వానరుని కొమార్తెలు ఇరువురిలోను కాలయందు కాలకేయులును, పులోమయందు పౌలోములును పుట్టిరి. వీరు కాక కశ్యపుని కొడుకులు ఇంకను కొందఱు కలరు. వారు పర్వతుఁడు అను దేవ ఋషి, విభండకుఁడు అను బ్రహ్మ ఋషి.
హిందూ సమాజములో సంప్రదాయములలో గోత్రము యొక్క ప్రాధాన్యత అపరిమితమైనది. ముఖ్యంగా పెళ్ళిళ్ళు చేసేటప్పుడు, వధూ వరులకు రాశి, నక్షత్ర, గోత్ర పొంతనలను చూస్తారు. ఎవరికైనా తమ యొక్క గోత్రం తెలియనప్పుడు తమది కాశ్యప గోత్రమని చెప్పుకోవచ్చును.అలాంటప్పుడు ఈ క్రింద ఉటంకించిన శ్లోకం చెప్పుకోవాలి.
శ్లో. గోత్రత్వస్యాఽపరిజ్ఞానే! కాశ్యపం గోత్రముచ్యతే |; యస్మాదాహ శ్రుతిః పూర్వం ప్రజాః కశ్యప సంభవాః||
తాత్పర్యం:- ప్రజలు కశ్యపుని వలన జన్మించారు అని శ్రుతివాక్యం.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.