కివీ పండు
From Wikipedia, the free encyclopedia
కివీ పండు అనేది 'యాక్టినిడియా చైనిన్సెస్' అనే తీగ జాతి మొక్కకు కాసే పండు. ఈ రకమైన పళ్ళను న్యూజిలాండ్ వంటి చల్లని దేశాల్లో పండిస్తారు. కివి పండుని 'చైనీస్ గూస్ బెర్రీ' అని కూడా అంటారు. ఇందుకు ప్రధాన కారణం కివీ పండులో ఆక్రోట్ ఫలం ఆకారంలో ఉండి గూస్ బెర్రీ రుచిని పోలి ఉంటాయి. కివీ పండు పన్నెండో శతాబ్దం నుండి సాగులో ఉంది. వీటి సాగు చైనా నుండి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాలకు విస్తరించడంతో ప్రసిద్ధి గాంచినవి.[1]