కె.సి.పంత్
భారత రక్షణ మంత్రి, హోం శాఖ సహాయ మంత్రిగా పనిచేసాడు / From Wikipedia, the free encyclopedia
కృష్ణ చంద్ర పంత్ (1931ఆగస్టు 10 - 12012 నవంబరు 15) 26 సంవత్సరాలు భారత పార్లమెంటు సభ్యుడుగా పనిచేసాడు. అతను కాశ్మీర్‌పై ప్రధానమంత్రికి సంభాషణకర్త.[2] అతను భారత ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రి, 37 సంవత్సరాల కాలంలో పలు రాజ్యాంగ పదవులను నిర్వహించాడు. పంత్ రక్షణ మంత్రి, హోం శాఖ సహాయ మంత్రి, ఉక్కు, భారీ ఇంజినీరింగ్, ఆర్థిక, అణుశక్తి, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి పదవులను నిర్వహించాడు.[3] అతను అణుశక్తి సలహా సంఘానికి మొదటి అధ్యక్షుడు, 10వ ఆర్థిక సంఘం అధ్యక్షుడు, భారతదేశ ఆర్థిక ప్రణాళికా సంస్థ ఉపాధ్యక్షుడు పదవులు నిర్వహించాడు. అతని ముందుచూపుపై 2020 డాక్యుమెంట్ ఇండియాస్ డెవలప్మెంట్ సినారియో, నెక్స్ట్ డికేడ్ అండ్ బియాండ్ అని ప్రచురించారు.[4]
త్వరిత వాస్తవాలు కృష్ణ చంద్ర పంత్, 18వ భారత రక్షణ మంత్రి ...
కృష్ణ చంద్ర పంత్ | |
---|---|
18వ భారత రక్షణ మంత్రి | |
In office 1987–1989 | |
23వ డిప్యూటీ ఛైర్మన్, భారత ప్రణాళికా సంఘం[1] | |
In office 1999–2004 | |
వ్యక్తిగత వివరాలు | |
జననం | (1931-08-10)1931 ఆగస్టు 10 భోవాలి, యునైటెడ్ ప్రావిన్సెస్, బ్రిటిష్ ఇండియా |
మరణం | 2012 నవంబరు 15(2012-11-15) (వయసు 81) ఢిల్లీ, భారతదేశం |
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ & భారతీయ జనతా పార్టీ |
జీవిత భాగస్వామి | ఇలా పంత్ |
సంతానం | 2 |
మూసివేయి