నేపాల్ రాజకీయ నాయకుడు From Wikipedia, the free encyclopedia
ఖడ్గా ప్రసాద్ శర్మ ఓలి (జననం 22 ఫిబ్రవరి 1952) నేపాల్ రాజకీయ నాయకుడు మాజీ నేపాల్ ప్రధాన మంత్రి. [1][2]ఇప్పటి వరకు మూడు సార్లు ప్రధానమంత్రిగా పనిచేశాడు.[3][4][5]2015 భారత ప్రభుత్వంతో కఠిన వైఖరితో ఉన్నాడు.భారతదేశంతో ఉన్న కొన్ని భూభాగాలు మవే అని రాజ్యాంగ సవరణ ద్వారా నేపాల్ మ్యాప్‌ను నవీకరించాడు.దీని వల్ల కొంత దేశీయ ప్రశంసలు, జాతీయవాదిగా ఖ్యాతిని పొందాడు.[6][7]
కేపీ శర్మ ఓలీ | |
---|---|
వ్యక్తిగత వివరాలు | |
జననం | ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలి 1952 ఫిబ్రవరి 22 టెహ్రథుమ్, నేపాల్ |
జాతీయత | నేపాలీ |
రాజకీయ పార్టీ | నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ (2018–2021) |
జీవిత భాగస్వామి | రాధిక |
సంతకం |
కేపీ శర్మ ఓలీ 1952 ఫిబ్రవరి 22 న టెహ్రథుమ్లో జన్మించాడు.తల్లిదండ్రులు మోహన్ ప్రసాద్, మధుమయ.రైతు కుటుంబ నేపథ్యం కలవారు.[8][9][10] ఓలికి నాలుగేళ్ల వయసులో తల్లి మశూచితో మరణించడంతో[11] అతని అమ్మమ్మ వద్ద పెరిగాడు.తన ప్రాధమిక పాఠశాల విద్యను టెహ్రథుమ్లో పూర్తి చేశాడు.[12] కేపీ శర్మ ఓలీ రాధికను వివాహం చేసుకున్నాడు.
1966లో రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. ఫిబ్రవరి 1970లో నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీలో చేరాడు.1970లో మొదటిసారిగా అరెస్టయ్యాడు. ఒక సంవత్సరం తర్వాత అతను పార్టీ జిల్లా కమిటీ సభ్యుడిగా,ఝాపా ఉద్యమ ఆర్గనైజింగ్ కమిటీకి చీఫ్ అయ్యాడు. 1972. ఓలి నిరంకుశ పంచాయతీ వ్యవస్థకు వ్యతిరేకంగా 1973 నుండి 1987 వరకు వరుసగా 14 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారు.1987 లో జైలు నుంచి విడుదలైన తరువాత, ఆయన కేంద్ర కమిటీ సభ్యులు అయ్యారు.[13]2015లో నేపాల్ కొత్త రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన కె.పి.శర్మ ఓలీ కొత్త ప్రధాని అయ్యారు. ఇతర పార్టీల నుంచి కూడా ఆయనకు మద్దతు లభించింది.అయితే జూలై 2016లో ఇతర పార్టీలు మద్దతు ఉపసంహరించుకోవడంతో ఓలీ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది.ప్రధానమంత్రిగా మూడు సార్లు పనిచేశాడు.
ఓలీకి రెండు సార్లు కిడ్నీ మార్పిడి జరిగింది. మొదటి 2007 లో అపోలో హాస్పిటల్ , న్యూఢిల్లీ జరిగింది రెండో సారి 2020 లో ఖాట్మండు జరిగింది.[14] [15]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.