కోరా అనేది ప్రశ్నలు,సమాధానాల ద్వారా విజ్ఞానాన్ని పంచుకునే ఒక ఆన్లైన్ వెబ్‌సైట్. ఇది 25 జూన్, 2009న స్థాపించబడింది. 21 జూన్, 2010న ప్రజలకు అందుబాటులో ఉంచబడింది. వినియోగదారులు సమర్పించిన ప్రశ్నలను సవరించడం, సమాధానాలపై వ్యాఖ్యానించడం ద్వారా తమకు కావాల్సిన సమాచారాన్ని పొందుతారు. 2020 నాటికి, ఈ వెబ్‌సైట్‌ను నెలకు 300 మిలియన్ల మంది వినియోగదారులు సందర్శిస్తున్నారు.[5]

త్వరిత వాస్తవాలు Type of business, Type of site ...
కోరా
Thumb
Type of businessప్రైవేటు
Type of site
ప్రశ్నలు,సమాధానాలు
Available inఅనేక భాషలు[1]
Foundedజూన్ 25, 2009; 15 సంవత్సరాల క్రితం (2009-06-25)
Headquartersమౌంటెన్ వ్యూ, కాలిఫోర్నియా, యు.ఎస్.
Area servedప్రపంచవ్యాప్తం
Founder(s)ఆడమ్ డి ఏంజెలో
చార్లీ చీవర్
Key peopleఆడమ్ డి ఏంజెలో (CEO)
కెల్లీ బటేల్స్ (CFO)[2]
Revenue$20 మిలియన్లు (2018)
Employees200-300 (2019)[3]
Registrationఐచ్ఛికం/అవసరం, అనామకంగా సమాధానాలు వ్రాయవచ్చు
Launchedజూన్ 21, 2010; 14 సంవత్సరాల క్రితం (2010-06-21)
Written inపైతాన్ (ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్), C++[4]
మూసివేయి

స్థాపన

కోరా ని జూన్ 2009లో మాజీ ఫేస్ బుక్ ఉద్యోగులు ఆడమ్ డి'ఏంజెల, చార్లీ చీవర్ స్థాపించారు. "ఆడమ్ డి ఏంజెలో, చార్లీ చీవర్‌లకు కోరా అనే పేరు ఎలా వచ్చింది?" అనే ప్రశ్నకు సమాధానంగా 2011లో కోరాలో వ్రాశారు, చార్లీ చీవర్ ఇలా పేర్కొన్నాడు, "మేము కొన్ని గంటలపాటు మేధోమథనం చేసాము, మేము ఆలోచించగలిగే అన్ని ఆలోచనలను వ్రాసాము. స్నేహితులతో సంప్రదించి, మేము ఇష్టపడని వాటిని తొలగించిన తర్వాత, మేము దానిని 5 లేదా 6కి కుదించి చివరికి కోరాగా స్థిరపరిచాము."[6][7]

అభివృద్ది

కోరా వెబ్‌సైట్ జనవరి 2011లో 500,000 మంది వినియోగదారులను కలిగి ఉన్నట్లు అంచనా వేయబడింది. జూన్ 2011లో, కోరా ఇంటర్‌ఫేస్ సమాచార ఆవిష్కరణ, బ్రౌజింగ్‌ను సులభతరం చేయడానికి పునఃరూపకల్పన చేయబడింది. శుద్ధి చేయబడిన దీని ఇంటర్‌ఫేస్ వికీపీడియాతో పోల్చదగినదని కొందరు సూచించారు. ఐఫోన్ కోసం అధికారిక మొబైల్ అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ సెప్టెంబర్ 29, 2011 న విడుదల చేయబడింది, అండ్రాయిడ్ కోసం అధికారిక మొబైల్ అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ సెప్టెంబర్ 5, 2012న విడుదల చేయబడింది.[8]

సెప్టెంబరు 2012లో, సహ వ్యవస్థాపకుడు చార్లీ సెవెర్ సంస్థ రోజువారీ బాధ్యతల నుండి తన రాజీనామాను ప్రకటించాడు. మెంటర్‌గా బాధ్యతాయుతంగా కొనసాగాడు.

మొబైల్ వినియోగం

మార్చి 20, 2013 నుండి ఇది పూర్తి టెక్స్ట్ శోధనగా ప్రశ్నలు, సమాధానాలను శోధించడానికి దాని వెబ్‌సైట్‌ను సెటప్ చేసింది. ఈ సదుపాయం మే చివరిలో మొబైల్ ఫోన్‌లకు విస్తరించబడింది. మే 2013లో విడుదల చేసిన నివేదికలో గత ఏడాదిలో కంటే అన్ని స్థాయిల్లో మూడు రెట్లు పెరిగిందని పేర్కొంది.[9][10]

వివిధ భాషల్లో

డిసెంబర్ 2019లో, కోరా తన మొదటి అంతర్జాతీయ ఇంజనీరింగ్ కార్యాలయాన్ని వాంకోవర్‌లో ప్రారంభించనున్నట్లు ప్రకటించింది, ఇది మెషిన్ లెర్నింగ్, ఇతర ఇంజినీరింగ్ విధులను నిర్వహిస్తుంది. అదే నెలలో, కోరా దాని అరబిక్, గుజరాతీ, హిబ్రూ, కన్నడ, మలయాళం, తెలుగు వెర్షన్‌లను ప్రారంభించింది.[11]

కోరాలో సమాధానాలు

కోరాలో సమాధానాలు ఆయా అంశాలపై నిజమైన అవగాహనను, మౌలికమైన పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నవారి నుంచి వస్తాయి. కోరా అనేది ఇరాన్ ఒప్పందంపై బరాక్ ఒబామా, జైలులో జీవితం గురించి ఖైదీలు, గ్లోబల్ వార్మింగ్‌పై శాస్త్రవేత్తలు, దోపిడీ దొంగలను అడ్డుకోవడంపై పోలీసు అధికారులు, అలాగే తమ కార్యక్రమాలను తెరకెక్కించే విధానంపై టీవీ నిర్మాతలు సమాధానాలిచ్చే చోటు. ఇది స్ఫూర్తిదాయక వ్యక్తులైన గ్లోరియా స్టీనెమ్, స్టీఫెన్ ఫ్రై, హిల్లరీ క్లింటన్, గ్లెన్ బెక్, షెరిల్ శాండ్ బర్గ్, వినోద్ ఖోస్లా, అలాగే గిలియన్ యాండర్సన్ వంటివారు నేరుగా ఎక్కువమంది సమాధానం కోరుతున్న ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే చోటు. కోరా అన్నది వేరే మార్గంలోనూ ఎన్నటికీ చేరుకోలేని వ్యక్తులు, ఎన్నడూ ఎక్కడా పంచుకోనటువంటి ముఖ్యమైన లోచూపులను చదవగలిగే చోటు.[12]

మూలాలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.