గడ్సర్ సరస్సు
From Wikipedia, the free encyclopedia
From Wikipedia, the free encyclopedia
గడ్సర్ సరస్సు కాశ్మీర్ లోయలోని గందర్బల్ జిల్లా లో 3600 మీటర్ల ఎత్తులో ఉన్న ఒక సుందరమైన సరస్సు. ఇది 0.85 కిలోమీటర్ల పొడవు, 0.76 కిలోమీటర్ల వెడల్పు కలిగి ఉంది.[1]
గడ్సర్ సరస్సు | |
---|---|
పువ్వుల లోయ | |
ప్రదేశం | గందర్బల్ జిల్లా, కాశ్మీరు లోయ |
అక్షాంశ,రేఖాంశాలు | 34.421669°N 75.057274°E |
రకం | ఒలిగోట్రోఫిక్ సరస్సు |
సరస్సులోకి ప్రవాహం | మంచు కరగడం |
వెలుపలికి ప్రవాహం | నీలం నది |
ప్రవహించే దేశాలు | భారతదేశం |
గరిష్ట పొడవు | 0.85 కిలోమీటర్లు (0.53 మై.) |
గరిష్ట వెడల్పు | 0.76 కిలోమీటర్లు (0.47 మై.) |
ఉపరితల వైశాల్యం | 0.7421 కి.మీ2 (0.2865 చ. మై.) |
ఉపరితల ఎత్తు | 3,600 మీటర్లు (11,800 అ.) |
ఘనీభవనం | డిసెంబర్ నుంచి ఏప్రిల్ |
కాశ్మీరీ భాషలో గడ్సర్ అంటే చేపల సరస్సు అని అర్థం. ఇది ట్రౌట్ వంటి అనేక రకాల చేపలకు సహజ ఆవాసం. ఈ సరస్సు నవంబర్ నుండి ఏప్రిల్ నెలల్లో ఎక్కువగా మంచుతో కప్పబడి ఉండి, ఘనీభవిస్తుంది. ఇది వివిధ రకాల అడవి పువ్వులతో నిండిన పచ్చిక భూములను కలిగి ఉంది కాబట్టి ఈ సరస్సును పువ్వుల లోయ అని కూడా అంటారు. ఈ సరస్సు ప్రధానంగా హిమానీనదాల ద్రవీభవనం ద్వారా ఏర్పడింది. దీని ప్రవాహం వాయువ్య దిశగా ఉండి, తులాయిల్ వద్ద నీలం నదిలో కలుస్తుంది.[2]
గడ్సర్ సరస్సు శ్రీనగర్ నుండి ఈశాన్యంలో 108 కిలోమీటర్ల దూరంలో, నారనాగ్ నుండి 28 కిలోమిటర్ల దూరంలో ఉంది. జూన్ నుండి సెప్టెంబర్ మధ్య కాలంలో ఈ సరస్సును సందర్శించడానికి అనువైన సమయం.[3] [4]
గడ్సర్ సరస్సును యమసర్ అని కూడా అంటారు, అంటే యమ సరస్సు అని అర్థం. దీనిని మృత సరస్సు అని కూడా అంటారు. ఎందుకంటే వేసవి కాలంలో ఈ సరస్సు పొలిమేరల్లో మేస్తున్న అనేక గొర్రెలను ఈ సరస్సు మింగేస్తుంది దీంట్లో ఉన్న ఆక్టోపస్ దీనికి కారణం అని ప్రజలు నమ్ముతారు. కాబట్టి దీనిని రాక్షస సరస్సుగా కూడా ప్రజలు భావిస్తారు.[5]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.