గారె
పిండి బిళ్ళలు దోరగా వేయించి తయారు చేసే భారతీయ వంటకం / From Wikipedia, the free encyclopedia
గారెలు లేదా వడలు అనగానే ప్రతీ తెలుగు వారికి ఒక లోకోక్తి గుర్తుకు వస్తుంది. అది "తింటే గారెలు తినాలి. వింటే భారతం వినాలి." అనేవారు. గారెలు తెలుగు వారికి అత్యంత ప్రీతి పాత్రమయిన వంటకములలో ఒకటి.[1] దీనిని కొబ్బరి పచ్చడితో గాని, వేరుశనగ పప్పు పచ్చడితో గాని, శనగ పప్పు పచ్చడితో గాని, అల్లం పచ్చడితో గాని జోడించి తింటే రుచి అమోఘంగా ఉంటుంది. కొందరు గారెలను బెల్లపు పాకంలో ముంచి మరికొద్ది రోజులు నిలువ ఉంచుతారు. ఇవి మరింత రుచికరంగా కూడా ఉంటాయి. తెలుగువారి ప్రతి పండుగకు ఈ వంటకము తప్పనిసరి. గారెలను తాలింపు వేసిన పెరుగులో నాన బెట్టి, పెరుగు గారెలను తయారు చేస్తారు. వీటిని ఆవడలు అంటారు. వీటి రుచి అమోఘం.