గొడుగు
వర్షం మరియు ఎండల నుండి రక్షించుటకు వాడబడే సాధనం. / From Wikipedia, the free encyclopedia
గొడుగు (ఆంగ్లం Umbrella) ఎండ, వానల నుండి మనల్ని రక్షించుకొనే అవసరమైన సాధనము. ఎండనుండి రక్షించడానికి గతంలో ఎక్కువగా నల్లని గొడుగులు మాత్రమే ఉండేవి. ఇప్పుడివి రంగురంగులలో అందంగా తయారవుతున్నాయి. కొంతమంది ముఖ్యంగా అమ్మాయిలు, పిల్లలు రంగుల గొడుగులు ఇష్టపడతారు. పల్లెల్లో తాటాకులతో గొడుగులు తయారుచేస్తారు.