గోజి...సూపర్‌ఫ్రూట్‌ , Goji Super Fruit తెల్లని మంచుకొండల్లో ఓ చిట్టిపొట్టి చెట్టు... చెట్టునిండుగా నీలిరంగు పూలు... ఎర్రెర్రని పండ్లూ...భూప్రపంచంమీద మరే పండులోనూ లేని యాంటీఆక్సిడెంట్లు అందులోనే ఉన్నాయి ... ఫలితం ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లలో అనేకరకాల పండ్ల సరసన గోజి పండ్లూ జ్యూసులూ పొడులూ కనిపిస్తున్నాయి. యాంటీఆక్సిడెంట్లు... అన్ని పండ్లలోనూ ఉంటాయి. కానీ ఇవి అత్యంత ఎక్కువగా ఉన్న 'గోజి' తింటే రోగనిరోధకశక్తి చాలాబాగా పెరుగుతుందన్న నమ్మకం పెరిగిపోయింది. దాంతో ఒకప్పుడు ఆసియాదేశాల్లో అదీ కొన్ని ప్రాంతాలకే పరిమితమైన గోజి, ఇప్పుడు అమెరికా, యూరప్‌మార్కెట్లలో రాజ్యమేలుతోంది. వెబ్‌సైట్లద్వారా ఈ మొక్కల అమ్మకం కూడా జరుగుతోంది. కేవలం 6 నుంచి 8 అడుగుల ఎత్తు వరకూ పెరిగే దీన్ని పెద్ద కుండీల్లో పెంచుకోవచ్చు. తాజా పండుగానూ డ్రైఫ్రూట్‌గానూ తినే గోజిని కొన్ని కంపెనీలు జ్యూస్‌రూపంలోనూ మార్కెట్‌ చేస్తున్నాయి. పెళ్లిచెట్టు అనీ యూత్‌ఫుల్‌ ట్రీ అని పిలిచే గోజి, హిమాలయశ్రేణుల్లోనూ పశ్చిమ చైనాలోనూ ఇంకా టిబెట్‌, మంగోలియాలోనూ ఎక్కువగా పెరుగుతుంది. ఎలా వచ్చిందో తెలియదుకానీ ప్రపంచవ్యాప్తంగా వాడుకలో ఉన్న పేరు వోల్ఫ్‌బెర్రీ. దీన్ని భారతీ యులు మురళి అనీ జపనీయులు కుకొ నొ మి అనీ పిలుస్తారు. అయితే ఇటీవల అంతా గోజిగా పిలవడం ప్రారంభించారు. ఎన్నో మంచి ఫలితాలనిచ్చే గోజి, ఉష్ణమండలప్రదేశాల్లో కూడా చక్కగా పెరుగుతుందట. ఇందులో సుమారు 41 జాతులున్నాయి. వీటిల్లో టిబెటన్‌ గోజి, హిమాలయన్‌ గోజి పేరుతో పండించేవి మాత్రం హెల్త్‌ ఫుడ్‌ మార్కెట్లో బాగా ప్రాచుర్యం పొందాయి. మే నుంచి అక్టోబర్‌ వరకూ ఈ పండ్లకు సీజన్‌. సూపర్‌ఫ్రూట్‌! దీనిమీద విస్తృతంగా పరిశోధనలు చేసిన చైనా పరిశోధకులు ఇందులో రోగనిరోధకశక్తిని పెంచే యాంటీఆక్సిడెంట్లతోపాటు అమైనోఆమ్లాలు, ఖనిజ లవణాలు చాలా ఎక్కువని తేల్చారు. * కంటినిండా నిద్రపడుతుందనీ ఆకలిని పుట్టిస్తుందనీ కొత్తగా చేసిన అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిని తినడంవల్ల వృద్ధాప్యం దరిచేరదనీ సుదీర్ఘకాలం జీవిస్తారనీ శక్తినిస్తాయనీ చైనా సంప్రదాయవైద్యం పేర్కొంటోంది. * ఆరోగ్యవంతుల్లో ఇది బీపీ, షుగర్‌, కొలెస్ట్రాల్‌ శాతం పెరగకుండా చేస్తుందట. * సెరటోనిన్‌ శాతాన్ని పెంచి ఆనందంగా ఉంచేందుకు దోహదపడుతుంది. అందుకే దీన్ని 'హ్యాపీ బెర్రీ' అనీ అంటారు. * కాలేయ పనితీరునీ మెరుగుపరుస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా క్యాన్సర్‌ కణాలను పెరగనివ్వదన్న ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. అందుకే 21వ శతాబ్దంలో అమెరికాతోపాటు ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లో ఇది సూపర్‌ఫ్రూట్‌గా మన్ననలు అందుకుంటూ బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ను సొంతం చేసుకుంది. అందానికీ గోజి వయసును కనిపించనివ్వదన్న కారణంతో కాస్మొటిక్స్‌లో దీని వాడకం విపరీతంగా పెరిగింది. పైగా ఇది పొడి చర్మానికి మంచి సంరక్షణకారి. అందుకే మాయిశ్చరైజర్లు, క్రీములు, సబ్బులు మార్కెట్లో బాగా వస్తున్నాయి. గోజిబెర్రీ, దానిమ్మరసంతో చేసిన లిప్‌బామ్‌లు లండన్‌లో బాగా ప్రాచుర్యం పొందాయి. కొన్ని కంపెనీలు షేవింగ్‌ క్రీముల్నీ తయారుచేస్తున్నాయి.[1]

ఎక్కడెక్కడ? మార్కెట్లో కనిపించే గోజి పండ్లలో ఎక్కువశాతం పశ్చిమచైనా నింగ్సియా ప్రాంతం నుంచే వస్తున్నాయి. దాదాపు 600 సంవత్సరాలనుంచి అక్కడ వాణిజ్యపంటగా వెలుగొందుతొన్న వోల్ఫ్‌బెర్రీని అక్కడివాళ్లు 'రెడ్‌ డైమండ్స్‌'గా పిలుస్తారు. ఇంకా మంగోలియా, క్వింగ్‌హాయ్‌, గన్సు, షాంక్సి ప్రాంతాల్లోనూ ఇవి ఎక్కువగా పండిస్తారు. అయితే వీటిలో ఎక్కువపండ్లను... పండగానే జాగ్రత్తగా కోసి వైన్‌లో ఓసారి వేసి తీసి డ్రైఫ్రూట్స్‌గా నిల్వచేస్తారు. ఎందుకంటే తాజాగా దొరకని ప్రాంతాల్లో ఎండుపండ్ల రూపంలోనే వీటి వాడకం ఎక్కువ. చైనీయులు ఔషధాలతోపాటు రకరకాల వంటకాల్లోనూ వీటిని వాడుతుంటారు. హెర్బల్‌ టీ కూడా చేస్తుంటారు. ద్రాక్షతోపాటు వీటిని కూడా కొన్ని రకాల వైన్స్‌లో వాడతారు. ఇటీవల ఇన్‌స్టంట్‌ కాఫీ పౌడర్‌ని కూడా చైనా తయారుచేస్తోంది. కేవలం పండ్లు మాత్రమే కాదు... గోజి ఆకులు, లేతకొమ్మల్ని చైనీయులు ఆకుకూరగా వాడుతుంటారు. పోషకాలెన్నో..! వందగ్రాముల ఎండు వోల్ఫ్‌బెర్రీల నుంచి 370 కిలో క్యాలరీల శక్తి వస్తుంది. ఇందులో 68% కార్బోహైడ్రేట్లు, 12% ప్రొటీన్లు, 10% పీచుపదార్థాలు లభ్యమవుతాయి. 112 మి.గ్రా. కాల్షియం, 1132మి.గ్రా. పొటాషియం, 9 మి.గ్రా. ఐరన్‌, 2 మి.గ్రా. జింక్‌, 1.3మి.గ్రా. విటమిన్‌ బి2, 7మి.గ్రా. బీటాకెరోటిన్‌ దొరుకుతాయి. అయితే విటమిన్‌-సి మాత్రం 26 నుంచి 100 గ్రా. వరకూ లభిస్తుంది. ఇది ఆరెంజెస్‌లోకన్నా చాలా ఎక్కువ. వెుత్తమ్మీద 11 రకాల ముఖ్యమైన ఖనిజలవణాలు, 18 అమైనో ఆమ్లాలు, 6 విటమిన్లు, 5 పాలీశాకరైడ్లు, 6 వోనోశాకరైడ్లు, 5 అన్‌శాచ్యురేటెడ్‌ ఫ్యాటీ ఆమ్లాలు, 5 కెరోటినాయిడ్లు, ఇంకా అనేక రకాల యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. పోషకాల సంగతెలా ఉన్నా ఇంటర్నెట్‌ పుణ్యమా అని గోజిపండ్లకు ఆదరణ పెరిగింది. కాబట్టి 'గో గోజి...' అన్న స్లోగన్‌ మెల్లగా మనకీ విస్తరించినా ఆశ్చర్యం లేదు.[2]
గోజీ
Dried goji berries

మూలాలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.