గోరు
From Wikipedia, the free encyclopedia
గోరు లేదా నఖం (Nails) కాలి, చేతి వేళ్ళకు చివర భాగం నుండి పెరిగే కొమ్ము (Horn) వంటి గట్టి నిర్మాణాలు. గోర్లు కెరటిన్ (Keratin) అనే ప్రోటీన్ తో చేయబడివుంటాయి.
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
మాతృగర్భంలో ఆకృతి దాల్చుకున్న పిండం 9వ వారంలోనే గోళ్లకు అంకురాలు పడతాయి. 15వ వారానికల్లా గోళ్ల పెరుగుదల ఆరంభమవుతుంది. ఇక అక్కడి నుంచీ జీవితాంతం పెరుగుతూనే ఉంటాయి. కాకపోతే ఈ పెరుగుదల పసిబిడ్డల్లో నెమ్మదిగా మొదలై వయసుతో పాటు క్రమేపీ వేగం పుంజుకుంటుంది. ఈ వేగం 20ల్లో, 30ల్లో అత్యధికంగా ఉంటుంది, 50ల తర్వాత ఒక్కసారిగా నెమ్మదిస్తుంది.
- కాలి గోళ్ల కన్నా చేతిగోళ్లు త్వరగా పెరుగుతాయి. కాలి గోళ్లు నెలకు 1 మిల్లీ మీటరు పెరిగితే చేతిగోళ్లు 3 మిల్లీ మీటర్ల వరకూ పెరగొచ్చు. చేతిగోరు మొదలు నుంచి చివరి వరకూ పెరగటానికి 100-180 రోజులు పడుతుంది, కాలిగోరు 12-18 నెలలు తీసుకుంటుంది.
- పోషకాహార లోపం, శారీరక వ్యాధులు, కాళ్లూ చేతులకు రక్తనాళ సమస్యల వల్ల గోళ్ల పెరుగుదలలో వేగం తగ్గొచ్చు. క్యాన్సర్ మందులతోనూ వేగం తగ్గొచ్చు.
- గర్భిణులకు, సోరియాసిస్ బాధితులకు వేగంగా పెరుగుతాయి.