చైత్యభూమి
భారత రాజ్యాంగ నిర్మాత బి.ఆర్. అంబేద్కర్ దహన స్థలం / From Wikipedia, the free encyclopedia
చైత్యభూమి అనేది (డా. బాబాసాహెబ్ అంబేద్కర్ మహాపరినిర్వాన్ మెమోరియల్ ) ఒక బౌద్ధ చైత్యం, భారత రాజ్యాంగ నిర్మాత బి.ఆర్. అంబేద్కర్ దహన స్థలం. ముంబైలోని దాదర్ చౌపటీ (బీచ్) పక్కనే ఉన్న ఈ స్థలం, ప్రతి సంవత్సరం అంబేద్కర్ వర్ధంతి (మహాపరినిర్వాన్ దివస్) డిసెంబరు 6న లక్షలాది మంది అంబేద్కర్ అనుచరులకు ఈ చైత్యభూమి పూజనీయమైన పుణ్యక్షేత్రంగా నిలుస్తోంది.[1][2][3]
త్వరిత వాస్తవాలు అక్షాంశ,రేఖాంశాలు, ప్రదేశం ...
అక్షాంశ,రేఖాంశాలు | 19°01′30″N 72°50′02″E |
---|---|
ప్రదేశం | దాదర్, ముంబై, మహారాష్ట్ర |
రకం | స్తూపం |
ప్రారంభ తేదీ | 1971 డిసెంబరు 5 |
అంకితం చేయబడినది | బి.ఆర్. అంబేద్కర్ |
మూసివేయి
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, గవర్నర్, మంత్రులు, అనేకమంది ఇతర రాజకీయ నాయకులు ప్రతి సంవత్సరం డిసెంబరు 6న చైత్యభూమిలో అంబేద్కర్‌కు నివాళులర్పిస్తారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా పర్యటించి, నివాళులు అర్పించాడు.[4] అంబేద్కర్ స్మారక చిహ్నంగా ఉన్న ఈ చైత్యభూమి, మహారాష్ట్ర ప్రభుత్వంచే ఏ-క్లాస్ పర్యాటకం, పుణ్యక్షేత్రంగా గ్రేడ్ చేయబడింది.[5]