డిహింగ్ నది
అసోంలోని నది / From Wikipedia, the free encyclopedia
డిహింగ్ నది (బుర్హి డిహింగ్) అనేది బ్రహ్మపుత్ర నదికి ఉపనది.[2] ఈశాన్య భారతదేశంలోని ఎగువ అస్సాంలో దాదాపు 380 కిలోమీటర్లు (240 మై.) ) పొడవుతో ఉంది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం తూర్పు హిమాలయాల్లో (పట్కాయ్ కొండలు) సముద్ర మట్టానికి 2,375 మీటర్లు (7,792 అ.) వద్ద ఉద్భవించి, అస్సాంలోని టిన్సుకియా (తినికుకీయా), దిబ్రూగర్ జిల్లాల గుండా ప్రవహించి దిహింగ్ముఖ్ వద్ద బ్రహ్మపుత్ర నదిలో కలుస్తోంది. దీని సుమారు 6,000 చదరపు కిలోమీటర్లు (2,300 చ. మై.) పరిధిలో విస్తరించి ఉంది. డిహింగ్ ఈ ప్రాంతంలో అనేక ఆక్స్బో సరస్సులను ఏర్పాటుచేసింది
డిహింగ్ నది బుర్హి డిహింగ్ నది | |
---|---|
స్థానం | |
దేశం | భారతదేశం |
భౌతిక లక్షణాలు | |
మూలం | పట్కాయ్ హిల్స్ |
• ఎత్తు | 2,375 మీ. (7,792 అ.) |
సముద్రాన్ని చేరే ప్రదేశం | బ్రహ్మపుత్ర నది |
• అక్షాంశరేఖాంశాలు | 27°14′0″N 94°42′0″E[1] |
పొడవు | 380 కి.మీ. (240 మై.) |
పరీవాహక ప్రాంతం | 6,000 కి.మీ2 (2,300 చ. మై.) |
డిమింగ్ నదికి దక్షిణ ఒడ్డున దిసాంగ్ అనే ఉపనది ఉంది. జైపూర్-డిహింగ్ రెయిన్‌ఫారెస్ట్, అనేక పెట్రోలియం క్షేత్రాలు, వరి పొలాలు, వెదురు తోటలు, తేయాకు తోటలతో కూడి ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. లెడో, మార్గరీటా, దిగ్బోయి, దులియాజన్, నహర్కాటియా (నహోర్కోటియా) వంటి చిన్నచిన్న పట్టణాలు కూడా ఉన్నాయి. బ్రహ్మపుత్ర నదికి డిహింగ్ అత్యంత ముఖ్యమైనది. డిహింగ్ లోయలోని మైదానాలు అనేక రకాల వృక్షజాలాన్ని, జంతుజాలాన్ని కలిగి ఉన్నాయి. ఇక్కడ తమలపాకులు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి.[2]