డి.జయకాంతన్
రచయిత / From Wikipedia, the free encyclopedia
జయకాంతన్ (24 ఏప్రిల్ 1934 – 2015 ఏప్రిల్ 8), తమిళ రచయిత, పాత్రికేయుడు, వక్త, సినీ నిర్మాత, సినీ విమర్శకుడు, సామాజిక కార్యకర్త. అతనిని జెకె అని కూడా పిలుస్తారు.[1] కడలూర్ లో జన్మించిన జయకాంతన్ చిన్నప్పుడే చదువు మానేశాడు. మద్రాసు వెళ్ళి అక్కడ, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాలో చేరాడు. 60ఏళ్ళ కెరీర్ లో 40నవలలు, 200చిన్న కథలు, రెండు జీవిత చరిత్రలు రాశాడు అతను. సాహిత్యంలోనే కాక సినిమా రంగంలోనూ తన ముద్ర వేశాడు జయకాంతన్. రెండు సినిమాలు తీయడంతో పాటు, అతను రాసిన నాలుగు నవలలను ఇతరులు సినిమాలుగా తీయడం విశేషం.
జయకాంతన్ | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | (1934-04-24)1934 ఏప్రిల్ 24 కడలూర్, సౌత్ ఆర్కాట్ డిస్ట్రిక్ట్ (మద్రాస్ ప్రెసిడెన్సీ), బ్రిటిష్ ఇండియా |
మరణం | 2015 ఏప్రిల్ 8(2015-04-08) (వయసు 80) చెన్నై, భారతదేశం |
వృత్తి | నవలా రచయిత, చిన్న కథా రచయిత, స్క్రీన్ ప్లే రైటర్, సినిమా దర్శకుడు |
భాష | తమిళం |
పురస్కారాలు | పద్మభూషణ్ పురస్కారం, జ్ఞానపీఠ పురస్కారం, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, ఆర్డర్ ఆఫ్ ఫ్రెండ్షిప్ |
జయకాంతన్ రచనలకు భారత సాహిత్యానికి ఇచ్చే అత్యంత ప్రతిష్ఠాత్మక పురస్కారాలైన జ్ఞానపీఠ పురస్కారం, సాహిత్య అకాడమీపురస్కారాలు లభించాయి. 2009లో భారతదేశ మూడవ అతి పెద్ద పౌర పురస్కారమైన పద్మభూషణ్ పురస్కారం కూడా అందుకున్నాడు జయకాంతన్. [2] 1978లో సోవియట్ ల్యాండ్ నెహ్రూ పురస్కారం, 2011లో రష్యా ప్రభుత్వం చే ఆర్డర్ ఆఫ్ ఫ్రెండ్ షిప్ పురస్కారాలు అందుకున్నాడు జయకాంతన్.