From Wikipedia, the free encyclopedia
నార్మల్ డోడెకేన్ (n-dodecane)అనేది 12 కార్బనులను కల్గిన,సరళ హైడ్రోకార్బన్ గొలుసు కల్గిన ఆల్కేన్ సమూహానికి చెందిన హైడ్రోకార్బన్.n-డోడెకేన్ కిరోసిన్, కొన్ని జెట్ ఇంధనాలలో ప్రధాన భాగం,, దాని పైరోలిసిస్ అధ్యయనం జెట్ ఫ్యూయల్ పైరోలైసిస్ను అర్థం చేసుకోవడానికి ఒక నమూనాగా ఉపయోగించ బడుతుంది.[4][5]N-డోడెకేన్ స్పష్టమైన రంగులేని ద్రవం.[6]ఇది జింగిబర్ అఫిసినల్ (అల్లం)తో సహా వివిధ మొక్కల ముఖ్యమైన/ఆవశ్యక నూనెల నుండి వేరుచేయబడింది.ఇది మొక్కల మెటాబోలైట్(జీవ క్రియ) పాత్రను కలిగి ఉంటుంది.[7]డోడెకేన్ అనేది కామెల్లియా సినెన్సిస్, అరిస్టోలోచియా ట్రయాంగ్యులారిస్, ఇతర జీవులలో లభించే ఒక సహజ ఉత్పత్తి.డోడెకేన్ యొక్క రసాయనిక సూత్రంC12H26. N-డోడెకేన్, బైహెక్సిల్ లేదా CH3-[CH2]10-CH3 అని కూడా పిలుస్తారు, ఆల్కేన్స్ అని పిలువబడే కర్బన సమ్మేళనాల తరగతికి చెందినది.N-డోడెకేన్ సగటున, నల్ల వాల్నట్లలో (జగ్లన్స్ నిగ్రా) అత్యధిక శాతం లో కనుగొనబడింది.[8]
పేర్లు | |
---|---|
Preferred IUPAC name
Dodecane[1] | |
గుర్తింపు విషయాలు | |
సి.ఎ.ఎస్. సంఖ్య | [112-40-3] |
పబ్ కెమ్ | 8182 |
యూరోపియన్ కమిషన్ సంఖ్య | 203-967-9 |
డ్రగ్ బ్యాంకు | DB02771 |
కెగ్ | C08374 |
వైద్య విషయ శీర్షిక | n-dodecane |
సి.హెచ్.ఇ.బి.ఐ | CHEBI:28817 |
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య | JR2125000 |
SMILES | CCCCCCCCCCCC |
బైల్ స్టెయిన్ సూచిక | 1697175 |
జి.మెలిన్ సూచిక | 201408 |
ధర్మములు | |
C12H26 | |
మోలార్ ద్రవ్యరాశి | 170.34 g·mol−1 |
స్వరూపం | Colorless liquid |
వాసన | Gasoline-like to odorless |
సాంద్రత | 0.7495 g mL−1 at 20 °C[2] |
ద్రవీభవన స్థానం | −10.0 నుండి −9.3 °C; 14.1 నుండి 15.2 °F; 263.2 నుండి 263.8 K |
బాష్పీభవన స్థానం | 214 నుండి 218 °C; 417 నుండి 424 °F; 487 నుండి 491 K |
log P | 6.821 |
బాష్ప పీడనం | 18 Pa (at 25 °C)[3] |
kH | 1.4 nmol Pa−1 kg−1 |
వక్రీభవన గుణకం (nD) | 1.421 |
స్నిగ్ధత | 1.34 mPa s |
ఉష్ణగతిక రసాయన శాస్త్రము | |
నిర్మాణము మారుటకు కావాల్సిన ప్రామాణిక ఎంథ్రఫీ ΔfH |
−353.5–−350.7 kJ mol−1 |
దహనక్రియకు కావాల్సిన ప్రామాణీక ఎంథ్రఫీ ΔcH |
−7901.74 kJ mol−1 |
ప్రామాణిక మోలార్ ఇంథ్రఫీ S |
490.66 J K−1 mol−1 |
విశిష్టోష్ణ సామర్థ్యం, C | 376.00 J K−1 mol−1 |
ప్రమాదాలు | |
భద్రత సమాచార పత్రము | hazard.com |
జి.హెచ్.ఎస్.పటచిత్రాలు | |
జి.హెచ్.ఎస్.సంకేత పదం | DANGER |
జి.హెచ్.ఎస్.ప్రమాద ప్రకటనలు | H304 |
GHS precautionary statements | P301+310, P331 |
జ్వలన స్థానం | {{{value}}} |
స్వయం జ్వలన ఉష్ణోగ్రత |
205 °C (401 °F; 478 K) |
విస్ఫోటక పరిమితులు | 0.6% |
సంబంధిత సమ్మేళనాలు | |
Related {{{label}}} | {{{value}}} |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
verify (what is ?) | |
Infobox references | |
355 డోడెకేన్ ఐసోమర్లు ఉన్నాయి.[9]
డోడెకేన్ సాధారణం గా ద్రవరూపంలో వున్న ఆల్కేన్.అంతేకాదు రంగులేని ద్రవం.[10] ఇది మండే స్వాభావం ఉన్న హైడ్రోకార్బన్.(NTP, 1992). ఇది అదృవ(non polar)ద్రావణి.నీటిలో కరగదు.[10]
లక్షణం/గుణం | మితి/విలువ |
అణు సూత్రం | C12H26 |
అణు భారం | 170.335 గ్రా/మోల్ |
సాంద్రత | 0.8± గ్రా/సెం. మీ3[11] |
మరుగు స్థానం | 216.1±3.0°C [11] |
ద్రవీభవన ఉష్ణోగ్రత | -9.55°C[12] |
వక్రీభవన గుణకం | 1.422[11] |
ఫ్లాష్ పాయింట్ | 71.1±0.0 °C[11] |
బాష్పీకరణ ఉష్ణశక్తి | 43.4±0.8కిలో జౌల్స్/మోల్ |
స్వయం జలన ఉష్ణోగ్రత | 203°C (397°F)[13] |
ఇథైల్ ఆల్కహాల్, ఇథైల్ ఈథర్, అసిటోన్, క్లోరోఫామ్, కార్బన్ టెట్రాక్లోరైడ్లలో బాగా కరుగుతుంది.వియోగం చెందెలా వేడి చేసినప్పుడు అది తీవ్రమైన పొగను, చికాకు కలిగించే పొగలను విడుదల చేస్తుంది.[14][15]
డోడెకేన్ ను ఆక్సిజన్ తో మండించినపుడు కార్బన్ డై ఆక్సైడ్, నీటిని ఏర్పరచును,అంటె కాక చర్య పలితంగా ఉష్ణశక్తి వెలువడును.ఈ ఉష్ణ శక్తిని యాంత్రిక చలన శక్తిగా లేదా ఇతర పదార్ధాలను వేడి చెయుటకు ఉపయోగిస్తారు.
ఒక పదార్థం వియోగం చెందటానికి ఆక్సిజన్ రహిత వాతవరణంలొ అధిక ఉష్ణొగ్రత వద్ద వేడిచెసి,వియోగ పలిత పదార్థాలను పొందటం జరుగును. పైరోలిసిస్ అనేది పదార్ధాలను వాటి ఉష్ణ వియోగం సులభతరం చేయడానికి సాపేక్షంగా జడ వాతావరణంలో అధిక ఉష్ణోగ్రతలకు లోబడి చేసే ప్రక్రియగా నిర్వచించవచ్చు. [16]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.