తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు
From Wikipedia, the free encyclopedia
Remove ads
తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు అనేది తెలంగాణ రాష్ట్రంలోని 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి ఆరోగ్య సమగ్ర సమాచార నివేదిక (హెల్త్ ప్రొఫైల్) సిద్ధం చేయాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన ఒక ప్రాజెక్టు.[1] దీర్ఘకాలిక బాధితులను గుర్తించి వారికి మెరుగైన వైద్యం అందించడం, క్యాన్సర్ వంటి రోగాలను ప్రాథమిక దశలోనే గుర్తించడం, రక్తహీనత వంటి సమస్యలను గుర్తించి తగిన చికిత్స అందించడం వంటివి ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం.[2]
Remove ads
ప్రారంభం
ఇందుకు సంబంధించిన పైలట్ ప్రాజెక్టుగా ములుగు, రాజన్న జిల్లాలను ప్రభుత్వం ఎంపికచేయగా, 2022 మార్చి 5న ములుగు జిల్లా కలెక్టరేట్‌లో హెల్త్ ప్రొఫైల్ పెలెట్ ప్రాజెక్టును తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖామంత్రి టి. హరీష్ రావు, పంచాయితీ రాజ్ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మహిళా శిశు సంక్షేమ శాఖామంత్రి సత్యవతి రాథోడ్ కలిసి ప్రారంభించి, ఇ- హెల్త్ కార్డులను అందజేశారు.[3] ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపి మాలోతు కవిత, ములుగు ఎమ్మెల్యే సీతక్క ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఇదే రోజున రాజన్న జిల్లాలోని వేములవాడలో హెల్త్ ప్రొఫైల్ పైలట్ ప్రాజెక్టును రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖామంత్రి కేటీఆర్ ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[4]
Remove ads
ప్రయోజనాలు
హెల్త్ ప్రొఫైల్‌లో భాగంగా వైద్యసిబ్బంది రాష్ట్రంలోని ఇంటింటికీ వెళ్ళి, ప్రతివ్యక్తి ఆరోగ్య సమాచారాన్ని సేకరించి, ప్రతి వ్యక్తికి ప్రత్యేకంగా ఒక ఐడీ నంబర్ ఇస్తారు. దీనికోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ-హెల్త్ ప్రొఫైల్ పేరుతో మొబైల్ యాప్‌ను తయారు చేసింది. ప్రతి వ్యక్తికి నమూనాలను సేకరించి, 30 రకాల డయాగ్నోస్టిక్ పరీక్షలు నిర్వహించి, ఫలితాల ఆధారంగా ఆరోగ్య సమస్యలను నిర్ధారిస్తారు. సమస్యలు ఏవైనా ఉంటే వెంటనే చికిత్స ప్రారంభించి, వివరాలన్నింటినీ ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ చేర్చుతారు.[5]
- ఇంటివద్ద పరీక్షలు: జ్వరం, రక్త పోటు, రక్తహీనత, రక్తంలో చక్కెర స్థాయి, వయసు తగ్గ ఎత్తు, బరువు, బ్లడ్ గ్రూపు, శరీర కొలతలు, రక్తంలో ప్రాణవాయువు, గుండె కొట్టుకునే తీరు, ఇతర అనారోగ్య సమస్యలు.
- ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద పరీక్షలు: రక్తం, మూత్ర నమూనాలను సేకరించడం, ఈసీజీ వంటి పరీక్షలు, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ (సీబీపీ), సంపూర్ణ మూత్ర పరీక్ష, ఆల్భూమిన్, బ్లడ్ యూరియా, క్రియాటిన్ (మూత్రపిండాల పనితీరు తెలుసుకునేందుకు), రక్తంలో చక్కరస్థాయి తెలుసుకొనేందుకు మూడు నెలల సగటు (హెచ్‌డీఏ 1సీ) పరీక్షలు, గుండె పనితీరును తెలుసుకునేందుకు కొలెస్ట్రాల్, కంప్లీట్ హెచ్డీఎల్, ట్రైగ్లిజరైడ్స్, ఈసీజీ, కాలేయ సంబంధిత పనితీరును తెలుసుకునేందుకు వివిధ కాలేయ పరీక్షలు.[3][6]
Remove ads
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads