దిస్పూర్

అస్సాం రాష్ట్ర రాజధాని, గౌహతిలోని ఒక శివారు ప్రాంతం. From Wikipedia, the free encyclopedia

దిస్పూర్map

దిస్పూర్, అస్సాం రాష్ట్ర రాజధాని, గౌహతిలోని ఒక శివారు ప్రాంతం. 1973లో దిస్పూర్ ను రాజధానిగా చేశారు. దీని పూర్వపు రాజధాని షిల్లాంగ్ అస్సాం నుండి వేరు చేయబడిన మేఘాలయ రాష్ట్రానికి రాజధానిగా మారింది. డిస్పూర్ అస్సాం ప్రభుత్వ పరిపాలన స్థానం. అస్సాం సెక్రటేరియట్ (జనతా భవన్) భవనం, అస్సాం లెజిస్లేటివ్ అసెంబ్లీ హౌస్, ఎమ్మెల్యే భవనం, స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్‌తోపాటు ఈ నగరంలోనే ఉన్నాయి. అస్సాం ట్రంక్ రోడ్డు, జిఎస్ రోడ్డు ఈ నగరం గుండా వెళుతుంది. దిస్పూర్‌కు దక్షిణంగా 1990లలో సృష్టించబడిన ఒక సాంస్కృతిక కేంద్రమైన బసిష్ట ఆశ్రమం,శంకర్‌దేవ్ కళాక్షేత్రం వేదాంతపరంగా ముఖ్యమైన ప్రదేశం ఉంది.

త్వరిత వాస్తవాలు దిస్పూర్, దేశం ...
దిస్పూర్
నివాస ప్రాంతం
Thumb
అస్సాం సెక్రటేరియట్
Thumb
Thumb
దిస్పూర్
దిస్పూర్
Thumb
దిస్పూర్
దిస్పూర్
Thumb
దిస్పూర్
దిస్పూర్
Coordinates: 26°8′23″N 91°47′33″E
దేశంభారతదేశం
రాష్ట్రంఅసోం
ప్రాంతంపశ్చిమ అస్సాం
జిల్లాకామరూప్ మెట్రో
Government
  Typeమేయర్-కౌన్సిల్
  Bodyగౌహతి నగరపాలక సంస్థ
  గవర్నర్/ఛాన్సలర్జగదీష్ ముఖి
Elevation
55–290 మీ (180−955 అ.)
జనాభా
 (2011)
  Total9,57,352[1]
భాష
  అధికారికఅస్సామీ[2]
Time zoneUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
పిన్ కోడ్
781005
టెలిఫోన్ కోడ్91 - (0) 361 - XX XX XXX
ISO 3166 codeIN-AS
Vehicle registrationAS - 01
కొప్పెన్ వాతావరణ వర్గీకరణతేమతో కూడిన ఉపఉష్ణమండల వాతావరణం
మూసివేయి

భౌగోళికం

పట్టణం నడిబొడ్డున భోరోలు నది (భోల్లోబ్రి) ప్రవహిస్తుంది.

వాతావరణం

గౌహతిలో భాగమైన ఈ దిస్పూర్ నటరం వేసవి, శీతాకాలాలను కలిగి ఉంటుంది. దిస్పూర్‌లో వర్షాకాలం జూన్ నెల నుండి ప్రారంభమవుతుంది. ఇక్కడ రుతుపవనాలు సాధారణంగా తీవ్రమైన ఉరుములతో పాటు భారీ వర్షాలతో కూడి ఉంటాయి.

రాజకీయం

దిస్పూర్ పట్టణం గౌహతి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉంది.[3] బిజెపికి చెందిన అతుల్ బోరా దిస్పూర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

పర్యాటక ఆకర్షణలు

దిస్పూర్‌ నగరంలో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి -

  • శిల్పాగ్రామ్: అస్సాం, ఇతర ఈశాన్య రాష్ట్రాల సాంస్కృతిక-హస్తకళల వారసత్వానికి ప్రసిద్ధి చెందింది. జాతి ఆభరణాలు, తివాచీలు, పట్టు చీరలు, చెక్క, మెటల్ హస్తకళలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. 
  • బసిష్ఠ ఆశ్రమం: ఇది దిస్పూర్ నుండి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ 835 బిఘాల భూభాగంలో శివాలయం ఉంది. మేఘాలయ కొండల నుండి ప్రారంభమైన పర్వతాల పక్కన ఉంది. ఈ నగరం గుండా బసిస్తా, భరలు అనే నదులు ప్రవహిస్తున్నాయి.
  • శ్రీమంత శంకరదేవ కళాక్షేత్రం: పంజాబరి ప్రాంతంలో ఉన్న ఒక సాంస్కృతిక సంస్థ. ఈ మ్యూజియం అస్సాంతోపాటు ఈశాన్య సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తుంది. దీనికి అస్సాంలోని గొప్ప సాంస్కృతిక విద్వాంసుడు, పండితుడు మహాపురుష్ శ్రీమంత శంకరదేవ పేరు పెట్టారు. మ్యూజియం లోపల సాంప్రదాయ ఆభరణాలు, దుస్తులు, విగ్రహాలు, వ్యాసాలు, ఆయుధాలు, రాతి, శాసనాలు అస్సాం సంస్కృతిని ప్రతిబింబించే వస్తువులు ప్రదర్శించారు. 

ఆరోగ్య సంరక్షణ

గౌహతి న్యూరోలాజికల్ రీసెర్చ్ సెంటర్ హాస్పిటల్స్, డిస్పూర్ హాస్పిటల్, క్యాపిటల్ స్టేట్ డిస్పెన్సరీ వంటి అనేక ఆసుపత్రులు, ఆరోగ్య సంరక్షణ కేంద్రాల ఇక్కడ ఉన్నాయి. 

మూలాలు

బయటి లింకులు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.