దేశాల వారీగా ప్రపంచ వారసత్వ ప్రదేశాలు
From Wikipedia, the free encyclopedia
2022 ఆగస్టు నాటికి, 167 దేశాలలో మొత్తం 1,154 ప్రపంచ వారసత్వ ప్రదేశాలను యునెస్కో గుర్తించింది. ఈ దేశాలన్నీ ప్రపంచ వారసత్వ ఒడంబడికకు కట్టుబడి ఉన్నవే. ఆ ఒడంబడికలో సభ్యత్వం లేని హోలీ సీ కూడా ఇందులో ఉంది. ఈ ప్రదేశాల్లో 897 సాంస్కృతికమైనవి, 218 సహజమైనవి, 39 మిశ్రమ లక్షణాలు కలిగినవి. [1] ప్రపంచ వారసత్వ కమిటీ ప్రపంచ దేశాలను ఆఫ్రికా, అరబ్ దేశాలు, ఆసియా-పసిఫిక్, ఐరోపా-ఉత్తర అమెరికా, లాటిన్ అమెరికా-కరేబియన్ అనే ఐదు భౌగోళిక మండలాలుగా విభజించింది. 58 ప్రదేశాలతో ఇటలీ, అత్యధిక ప్రపంచ వారసత్వ ప్రదేశాలను కలిగి ఉంది. [2]
ప్రపంచ వారసత్వ జాబితాలో 27 దేశాలకు సంబంధించిన ప్రదేశాలేమీ లేవు. అవి: బహామాస్, భూటాన్, బ్రూనై, బురుండి, కొమొరోస్, కుక్ దీవులు, జిబౌటి, ఈక్వటోరియల్ గినియా , ఎస్వతిని, గ్రెనడా, గినియా -బిస్సౌ, గయానా, మోకో, మాకో, కువైట్, రువాండా, సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనడైన్స్, సమోవా, సావో టోం అండ్ ప్రిన్సిపే, సియెర్రా లియోన్, సోమాలియా, దక్షిణ సూడాన్, తైమూర్-లెస్టే, టోంగా, ట్రినిడాడ్ అండ్ టొబాగో. [3]