నమిత
దక్షిణ భారతదేశ నటీమణి / From Wikipedia, the free encyclopedia
నమితగా తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయమైన నటీమణి అసలు పేరు నమిత వాంక్వాలా. ఈమె మే 10, 1980లో గుజరాత్ రాష్ట్రం సూరత్ లోజన్మించింది.
త్వరిత వాస్తవాలు
నమిత | |
జన్మ నామం | నమిత ముఖేశ్ వాంక్వాలా [1] |
జననం | (1980-05-10) 1980 మే 10 (వయసు 44) సూరత్, గుజరాత్, భారతదేశం |
ఇతర పేర్లు | భైరవి |
క్రియాశీలక సంవత్సరాలు | 2002-ఇప్పటివరకు |
భార్య/భర్త | వీరేంద్ర చౌదరి (m. 2017) |
మూసివేయి
1998లో మిస్ సూరత్ గా, 2001లో మిస్ ఇండియా పోటీల్లో నాలుగవ స్థానం సంపాదించింది.
జెమిని చిత్రంతో తెలుగు సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టినది. ఆ తరువాత సొంతం, ఒక రాజు ఒక రాణి, ఓ రాధ ఇద్దరు కృష్ణుల పెళ్ళి చిత్రాలలో నటించి ప్రేక్షకుల మన్ననల్ని పొందింది. ఆ తరువాత తమిళ, కన్నడ, హిందీ సినీరంగంలోకి ప్రవేశించింది.
ఈ బొద్దుగుమ్మ 2010లో వచ్చిన సింహా చిత్రంలోనూ విశేషంగా అలరించింది. నమిత 2017లో నటుడు, వ్యాపారవేత్త వీరేంద్ర చౌదరిని పెళ్లాడింది. వీరికి కవలలు జన్మిచ్చారు. ఈ విషయాన్ని 2022 ఆగస్టు 19న ఇద్దరు మగ శిశులకు జన్మనిచ్చినట్టు ఆమె ప్రకటించింది.[2]