From Wikipedia, the free encyclopedia
జ్యోతిష్య సంప్రదాయంలోనూ, తత్ఫలితంగా హిందువుల దైనందిక జీవిత ఆచారాలలోనూ నవగ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మనుష్యుల స్థితి గతులు, భవిష్యత్తు, వ్యవహారాలపై వీటి ప్రభావం గురించి చాలా మంది దృఢంగా విశ్వాసం కలిగి ఉంటారు. సూర్యుడికి అధిపతి అగ్ని, చంద్రుడికి అధిపతి వరుణుడు, కుజుడికి అధిపతి కుమారస్వామి, బుధుడికి అధిపతి విష్ణువు, గురువుకు అధిపతి ఇంద్రుడు, శుక్రుడికి అధిపతి శచీదేవి, శనికి అధిపతి బ్రహ్మ. సూర్యుడు కారానికి, చంద్రుడు లవణానికి, కుజుడు చేదుకు, బుధుడు షడ్రుచులకు, గురువు తీపికి, శుక్రుడు పులుపుకు, వగరు రుచులకు అధిపతులు. సూర్యుడు ఆయనముకు, చంద్రుడు క్షణముకు, కుజుడు ఋతువుకు, బుధుడు మాసముకు, గురువు పక్షముకు, శుక్రుడు సంవత్సరంలకు అధిపతులు.
నవ గ్రహాలను పూజించడం, హోమాలు, వ్రతాలు నిర్వహించడం చాలామంది హిందువుల ఆచారాలలో ఒక ముఖ్యమైన అంశం. చాలా ఆలయాలలో, ముఖ్యంగా శివాలయాలలో నవగ్రహాల మందిరాలు ఉంటాయి. ఇంకా ప్రత్యేకించి గ్రహాల ఆలయాలు కూడా ఉన్నాయి.
జ్యోతిష్య సంప్రదాయంలో నవ గ్రహాల గుణాలనూ, సంకేతాలనూ తెలిపే ఒక పట్టిక క్రింద ఇవ్వబడింది.
పేరు | ఆంగ్లంలో | గుణము | సూచిక |
---|---|---|---|
సూర్యుడు (सूर्य) | Sun | సత్వము | ఆత్మ, రాజయోగం, పదోన్నతి, పితృయోగం. |
చంద్రుడు (चंद्र) | Moon | సత్వము | మనసు, రాణి యోగం, మాతృత్వం. |
కుజుడు (मंगल) | Mars | తామసము | శక్తి, విశ్వాసం, అహంకారం |
బుధుడు (बुध) | Mercury | రజస్సు | వ్యవహార నైపుణ్యం |
బృహస్పతి,గురువు (बृहस्पति) | Jupiter | సత్వము | విద్యా బోధన |
శుక్రుడు (शुक्र) | Venus | రజస్సు | ధనలాభం, సౌఖ్యం, సంతానం |
శని (शनि) | Saturn | తామసము | పరీక్షా సమయం. ఉద్యోగోన్నతి, చిరాయువు |
రాహువు (राहु) | Head of Demon Snake Ascending/North Lunar Node | తామసము | తన అధీనంలో ఉన్నవారి జీవితాన్ని కలచివేసే గుణం |
కేతువు (केतु) | Tail of Demon Snake Descending/South Lunar Node | తామసము | విపరీత ప్రభావాలు |
నవగ్రహ అలయలు మొత్తముగా తమిళనాడులో ఉన్నాయి. అవి 1. అంగారక గ్రహనికి గాను వైదీస్వరన్ కొవెల
2. బుధ గ్రహానికి గాను తిరువెన్కాదు
3. శుక్ర గ్రహానికి గాను కన్ఛనూరు
4. కేతు గ్రహానికి గాను కీల్రుమ్పల్లమ్
5. గురు గ్రహానికి గాను ఆలంగుడి
6. శని గ్రహానికి గాను తిరునల్లారు
7. రాహువు గ్రహానికి గాను తిరునాగేశ్వరమ్
8. చంద్ర గ్రహానికి గాను తిన్గలూరు
9. సూర్య గ్రహానికి గాను సూరియానారు
నవగ్రహాలను స్తుతించే ఒక బహుళ ప్రచారంలో ఉన్న శ్లోకం
రవి
చంద్ర
కుజ
బుధ
గురు
శుక్ర
శని
రాహు
కేతు
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.