పర్వత కనుమ
పర్వత శ్రేణి దాటేందుకు ఉండే దారి / From Wikipedia, the free encyclopedia
పర్వత కనుమ, ఒక పర్వత శ్రేణి గుండా లేదా ఒక శిఖరం మీదుగా ప్రయాణించదగిన మార్గం. ప్రపంచంలోని అనేక పర్వత శ్రేణులు, ప్రయాణాలకు గట్టి అడ్డంకులుగా నిలిచినందున, వాణిజ్యం లోను, యుద్ధాల్లోనూ చరిత్ర అంతటా మానవ, జంతువుల వలసల్లోనూ కనుమ దారులు కీలక పాత్ర పోషించాయి. తక్కువ ఎత్తులో ఉన్న కనుమలను కొండ కనుమ అని అంటారు.