ప్రాంతీయ ఫోన్కోడ్
భారత టెలీకమ్యూనికేషన్ శాఖ, టెలిఫోన్ నంబర్లను టెలిఫోన్లు లేదా ఇతర టెలిఫోన్ అంత్య బిందువులకి లై / From Wikipedia, the free encyclopedia
ప్రాంతీయ ఫోన్కోడ్ సాంప్రదాయిక వైరుమూలకంగా పనిచేసే టెలిఫోను వ్యవస్థలో ఒక ప్రాంతంలోని వ్యక్తులు, వేరే ప్రాంతంలోని వ్యక్తులకు ఫోను ద్వారా సంప్రదించడానికి వాడవలసిన క్లుప్త సంఖ్య. ఈ ప్రాంతాలు దేశంలో గల టెలిఫోన్ ఎక్స్చేంజిల ప్రాతిపదికన విభజించబడతాయి. అలాగే అంతర్జాతీయంగా ఒక్కొక్క దేశానికి ఒక్కొక కోడు నిర్ణయించబడుతుంది. వెలుపలి దేశాలలో ఉన్న బంధుమిత్రులకు, ఇతర వ్యవహారాలకు ఫోనుచేయడానికి ఆయాకోడులను, ఆయా దేశంలోని ప్రాంతీయ ఫోన్ కోడ్ తో పాటు ఉపయోగించాలి. కోడు నంబర్లను ఫోనునంబరుకు ముందుగా జతచేయాలి.