ప్రోగ్రామింగు భాష
From Wikipedia, the free encyclopedia
ప్రోగ్రామింగు
ఈ వ్యాసంలో అక్షరదోషాలు, వ్యాకరణం, శైలి, ధోరణి మొదలైన వాటిని సరి చెయ్యడం కోసం కాపీ ఎడిటింగు చెయ్యాల్సి ఉంది. |
భాష కంప్యూటరు లాంటి యంత్రాలను నియంత్రించేందుకు అవసరమైన సందేశాలను ఇవ్వటానికి ఉపయోగపడే ఒక కృత్రిమమైన భాష. మనుషులు మాట్లాడుకునే భాషలలో ఉన్నట్లే ఈ భాషలలో కూడా వ్యాకరణ నియమాలు, సందర్భోచితంగా ఉపయోగించాల్సిన వాక్యనిర్మాణ నియమాలు ఉంటాయి.
ప్రోగ్రామింగు భాషలను, సమాచారాన్ని వివిధ రూపాలలో ఏ విధంగా అమర్చుకోవాలో, అలా అమర్చుకోవటానికి చేయవలసిన పనులను, సరైన పద్ధతిలో తెలుపటానికి ఉపయోగిస్తారు. కొంతమంది ఎటువంటి పనులనయినా విస్పష్టంగా తెలియజేయగలిగే భాషలను మాత్రమే ప్రోగ్రామింగు భాషలని పిలవటానికి ఇష్టపడతారు[1]. అందుకని కొన్ని కొన్ని హద్దులున్న ఇతర కృత్రిమ భాషలను "కంప్యూటరు భాష"లని పిలుస్తుంటారు.
ఇప్పటికే కొన్ని వేల ప్రోగ్రామింగు భాషలు సృష్టించారు[2], అంతేకాదు ప్రతీ సంవత్సరం చాలా కొత్తకొత్త భాషలు పుడుతూనే ఉన్నాయి.