ఫార్ములా ఈ రేస్
From Wikipedia, the free encyclopedia
ఫార్ములా ఈ రేస్ (ఆంగ్లం: ABB FIA Formula E World Championship) అనేది సింగిల్-సీటర్ ఎలక్ట్రిక్ కార్ల మోటార్‌స్పోర్ట్ ఛాంపియన్షిప్.[1] ఈ సిరీస్ 2011లో పారిస్‌లో FIA ప్రెసిడెంట్ జీన్ టాడ్, ఫార్ములా ఈ హోల్డింగ్స్ ప్రస్తుత ఛైర్మన్ అయిన స్పానిష్ వ్యాపారవేత్త అలెజాండ్రో అగాగ్లచే రూపొందించబడింది.[2] ప్రారంభ ఛాంపియన్షిప్ రేసు 2014 సెప్టెంబరులో బీజింగ్‌లో జరిగింది.[3] 2020-21 సీజన్ నుండి సిరీస్ FIA ప్రపంచ ఛాంపియన్షిప్ హోదా పొందింది.[4]