బెట్ ద్వారక
గుజరాత్ లో ఒక దీవి / From Wikipedia, the free encyclopedia
బెట్ ద్వారక లేక శంఖోదర్ గుజరాత్లో ఓఖా పట్టణం నుండి 3 కి.మీ. దూరంలో నున్న ఒక దీవి. కచ్ సింధుశాఖలో ఉన్న ఈ దీవి 13 కి.మీ. పొడవు, 4 కి.మీ సగటు వెడల్పూ కలిగి ఉంది. ఇది ద్వారక పట్టణం నుండి 30 కి.మీ ఉత్తరంగా ఉంది.[1][2]