From Wikipedia, the free encyclopedia
బెహెనిక్ ఆమ్లం (Behenic acid ; also docosanoic acid) ఒక రకమైన సంతృప్త కొవ్వు ఆమ్లం. దీని రసాయన ఫార్ములా : C21H43COOH.
పేర్లు | |
---|---|
IUPAC నామము
Docosanoic acid | |
ఇతర పేర్లు
Behenic acid, Docosanoic acid; 1-Docosanoic acid; n-Docosanoic acid, n-Docosanoate, Glycon B-70, Hydrofol Acid 560, Hydrofol 2022-55, Hystrene 5522, Hystrene 9022, Prifrac 2989, C22:0 (Lipid numbers) | |
గుర్తింపు విషయాలు | |
సి.ఎ.ఎస్. సంఖ్య | [112-85-6] |
పబ్ కెమ్ | 8215 |
యూరోపియన్ కమిషన్ సంఖ్య | 204-010-8 |
కెగ్ | C08281 |
సి.హెచ్.ఇ.బి.ఐ | CHEBI:28941 |
SMILES | O=C(O)CCCCCCCCCCCCCCCCCCCCC |
| |
ధర్మములు | |
C22H44O2 | |
మోలార్ ద్రవ్యరాశి | 340.59 g·mol−1 |
స్వరూపం | White to yellowish crystals or powder |
ద్రవీభవన స్థానం | 80.0 °C[1] |
బాష్పీభవన స్థానం | 306 °C |
ప్రమాదాలు | |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
verify (what is ?) | |
Infobox references | |
బెహెనిక్ ఆమ్లం 22 కార్బనులుండి పొడవైన హైడ్రొకార్బను గొలుసును కలిగివున్న సంతృప్త కొవ్వుఆమ్లం. సరళమైన, శాఖలులేని శృంఖలంనుకలివున్న కొవ్వు ఆమ్లం. బెహెనిక్ ఆమ్లం శాకనూనెలలో తక్కువప్రమాణంలో వున్నఆమ్లం. శాస్త్రీయ నామం: n-డొకసనొయిక్ ఆమ్లం. ఫార్ములా C21H43COOH. తెల్లగా లేదా క్రీమ్‌రంగులో స్పటికరూపంలో వుండును. మొరింగేసి కుటుంబానికి చెందిన బెన్ లేదా బెహెన్ (Moringo oleifera) అనగా మునగ విత్తననూనెలో మొదటగా గుర్తించారు. అందుచే ఈఅమ్లానికి బెహెనిక్ అనేపేరు రూడి అయ్యింది. బెన్ విత్తననూనెలో కాకుండగా వేరుశెనగ నూనె, ఆవాల నూనె (mastard or canola) లో అతికొద్దిశాతంలో కన్పించును. ఈనూనెలలో 1-2% వరకు మాత్రమే ఉంది. వేరుశనగ విత్తనం పైపోరలో బెహెనిక్ ఆమ్లం ఎక్కువగా నిక్షిప్తమై వున్నది.. బెహెనిక్ ఆమ్లం యాంటిఅక్క్షిడెంట్ గుణాలను కలిగివున్నది. అయితే బెహనిక్ ఆమ్లానికి కొలెస్ట్రాల్‌ను పెంచుగుణం కూడా ఉంది. బెహెనిక్ ఆమ్లం జీర్ణవ్యవస్దలో అంతత్వరగా శోషింపబడదు. బెహెనిక్ అమ్లాన్ని క్షయికరించిన (reduction) బెహెనిక్ అల్కహాల్ ఎర్పడును.
అణుసౌష్టవ ఫార్ములా:C22H44O2 లేదా CH3 (CH2) 20COOH
బెహెనిక్ఆమ్లం దర్మాల పట్టిక
లక్షణము | విలువల మితి |
స్వరూపం | ఘనస్పటికం, తెలుపు |
ఆణుభారం | 340.58 |
ద్రవీభవన ఉష్ణోగ్రత | 79.950C |
మరుగు ఉష్ణోగ్రత | 3060C |
వక్రీభవన సూచిక nD40 | 1.4270 |
సపొనిఫికెసన్ విలువ | 163-169 (mgKOH/Gram) |
కలరు (టింటొమిటరు) | 7.0Y+1.0R |
ద్రావణీయత | క్లొరొఫారం, యిథైలీథరులలో కరుగును. |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.