భారతీయ నటి From Wikipedia, the free encyclopedia
భావనా బల్సావర్, మహారాష్ట్రకు చెందిన నాటకరంగ, టివి, సినిమా నటి.[1] 2010లో వచ్చిన గుతుర్ గు అనే సిరీస్ లో నటించింది.[2][3]
భావన బాల్సవర్ | |
---|---|
జననం | |
విద్య | ఎస్.ఎన్.డి.టి. కళాశాల |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1993–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | కరణ్ షా (m. 2002) |
తల్లిదండ్రులు | డిఎం బల్సావర్ (తండ్రి) శుభా ఖోటే (తల్లి) |
భావన 1975 అక్టోబరు 21న డిఎం బల్సావర్ - హిందీ సినీ నటి శుభా ఖోటే దంపతులకు మహారాష్ట్రలోని ముంబై నగరంలో జన్మించింది. భావనకు ఇద్దరు తోబుట్టువులు ఉన్నారు. వీరిలో అశ్విన్ బల్సావర్ సౌండ్ రికార్డిస్ట్.[4] భావన ఆర్య విద్యా మందిర్ పూర్వ విద్యార్థి, 10వ తరగతిలో ఐసిఎస్ఈ టాపర్ గా నిలిచింది.[5] ఆమె ఎస్.ఎన్.డి.టి. కళాశాల నుండి డ్రెస్ డిజైనింగ్, ఫ్యాషన్ కోఆర్డినేషన్లో గ్రాడ్యుయేట్ పట్టా పొందింది.
2002లో సినీ నటుడు కరణ్ షాతో భావన వివాహం జరిగింది.[6][7] భావన తాత, నందూ ఖోటే ప్రముఖ రంగస్థల నటుడు, మూకీ సినిమాల్లో నటించాడు, వీరి కోడలు నటి దుర్గా ఖోటే.[8] ఆమె నటుడు విజు ఖోటే మేనకోడలు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.