మాతికెట్టన్ షోలా జాతీయ వనం కేరళ, ఇడుక్కి జిల్లా, ఉడుంబంచోలా తాలూకా లోని పూపారా ప్రాంతంలో ఉంది..[1] ఇది 12.82 చ.కి.మీ. విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. 1897 లో ట్రావెన్కూరు ప్రభుత్వం ఈ అడవిని రిజర్వు ఫారెస్టుగా గుర్తించింది. ఇందులోని కొంత భాగాన్ని ఏలకుల తోటల పెంపకానికి లీజుకిచ్చారు. ఆ తరువాత, ఇందులోని వృక్ష జంతుజాలాన్ని, పర్యావరణాన్నీ సంరక్షించేందుకు దీన్ని 2003 నవంబరు 21 న జాతీయ వనంగా ప్రకటించారు.[2] ఈ వనంలో ఏనుగు ప్రధానమైన జంతువు.

త్వరిత వాస్తవాలు మాతికెట్టన్ షోలా జాతీయ వనం, ప్రదేశం ...
మాతికెట్టన్ షోలా జాతీయ వనం
IUCN category II (national park)
Thumb
Thumb
Map showing the location of మాతికెట్టన్ షోలా జాతీయ వనం
ప్రదేశంకేరళ, భారతదేశం
సమీప నగరంమున్నార్
విస్తీర్ణం12.82 కి.మీ2 (4.95 చ. మై.)
స్థాపితం2003 నవంబరు 21
మూసివేయి

రవాణా మార్గం

పూపారా నుండి మున్నార్ మీదుగా మాతికెట్టన్ షోలాకు వెళ్ళవచ్చు. కొత్తమంగళం మీదుగా పూపారా నుండి ఇడుక్కి వెళ్ళే దారి గుండా కూడా ఇక్కడికి చేరుకోవచ్చు. కొచ్చి, మదురైలు, దీనికి సమీపం లోని విమానాశ్రయాలు. దగ్గర లోని రైల్వే స్టేషను కొట్టాయం.

మూలాలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.