మారిషస్
From Wikipedia, the free encyclopedia
మారిషెస్ అధికారిక నామం రిపబ్లిక్ ఆఫ్ మారిషెస్, (République de Maurice), ఇది ఒక ద్వీప దేశం. ఆఫ్రికా ఖండతీర ఆగ్నేయ తీరప్రాంతంలో 2000 కీ.మీ దూరంలో హిందూ మహాసముద్రంలో ఉంది. నైఋతిదిశన, మడగాస్కర్కు పశ్చిమాన 870 కి.మీ. మారిషస్‌కు తూర్పున 560 కి.మీ దూరాన రోడ్రిగ్యూసు, అగలెగా, సెయింటు బ్రాండను ద్వీపాలు కూడా మారిషస్‌లో భాగంగా ఉన్నాయి. ఫ్రెంచి ఓవర్సీసు రీయునియనులో మాస్కరెనె ద్వీపాలతో మారిషస్, బ్రాండను భాగంగా ఉన్నాయి. మారిషస్ వైశాల్యం 2,040 చ.కి.మీ. రాజధాని నగరం పోర్టు లూయిసు దేశంలో అతిపెద్ద నగరంగా కూడా ప్రత్యేకత కలిగి ఉంది.
రిపబ్లిక్ ఆఫ్ మారిషెస్ République de Maurice |
||||||
---|---|---|---|---|---|---|
నినాదం "Stella Clavisque Maris Indici" (Latin) "Star and Key of the Indian Ocean" |
||||||
జాతీయగీతం |
||||||
రాజధాని అతి పెద్ద నగరం | పోర్ట్ లూయిస్ Coordinates: Unable to parse latitude as a number:2 { | |||||
అధికార భాషలు | ఆంగ్లం1 తెలుగు | |||||
గుర్తింపు పొందిన ప్రాంతీయ భాషలు | en:Mauritian Creole, భోజ్‌పురి, French, Chinese | |||||
ప్రజానామము | Mauritian | |||||
ప్రభుత్వం | పార్లమెంటరీ రిపబ్లిక్ | |||||
- | అధ్యక్షుడు | అనిరుధ్ జగన్నాథ్ | ||||
- | ప్రధానమంత్రి | నవీన్ చంద్ర రామ్‌గులామ్ | ||||
స్వాతంత్ర్యము | ఆంగ్లేయుల నుండి | |||||
- | Date | మార్చి 12 1968 | ||||
- | గణతంత్రం | మార్చి 12 1992 | ||||
- | జలాలు (%) | 0.05 | ||||
జనాభా | ||||||
- | 2006 అంచనా | 1,256,7392 (153rd) | ||||
జీడీపీ (PPP) | 2006 అంచనా | |||||
- | మొత్తం | $16.0 billion (119th) | ||||
- | తలసరి | $13,703 (51st) | ||||
మా.సూ (హెచ్.డి.ఐ) (2004) | 0.804 (high) (65th) | |||||
కరెన్సీ | en:Mauritian rupee (MUR ) |
|||||
కాలాంశం | MUT (UTC+4) | |||||
- | వేసవి (DST) | not observed (UTC+4) | ||||
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | .mu | |||||
కాలింగ్ కోడ్ | +230 | |||||
1 | [1][2] | |||||
2 | The population estimate is for the whole republic. For the island of Mauritius only, as at 31 December 2006, it is 1,219,220[3] |
ప్రారంభంలో డచ్చి కాలనీ (1630-1710) తరువాత ఫ్రెంచి కాలనీ (1715-1810)గా ఉండి తరువాత బ్రిటిషు కాలనీగా మారి 1968 వరకు బ్రిటిషు ఆధీనంలో ఉండి తరువాత స్వతంత్రం పొందింది. " బ్రిటిషు క్రౌను కాలనీ ఆఫ్ మొరీషియసులో ఒకప్పుడు మారిషస్, రోడ్రిగ్యూసు, అగలెగా, సెయింటు బ్రాండను, చాగోసు ఆర్చిపిలాగో, సేచెల్లిసు భాగంగా ఉన్నాయి. 1903 లో సైచెల్లిసును ప్రయేక కాలనీగా రూపొందించిన తరువాత మారిషస్ క్రమంగా అభివృద్ధి చెందడం మొదలైంది. 1965 లో చాగో ద్వీపసమూహం మారిషస్ నుండి తొలగించబడింది. చాగోసు ద్వీపసమూహం మీద సార్వభౌమాధికారం విషయంలో మారిషస్, యునైటెడు కిండం మద్య విబేధాలు తలెత్తాయి. 1965 లో మారిషస్ స్వతంత్రానికి 3 సంవత్సరాల ముందు యు.కె. చాగో ద్వీపసమూహాన్ని మారిషస్ నుండి తొలగించింది. యు.కె. క్రమంగా ద్వీపసమూహంలోని స్థానిక ప్రజలను తొలగించి ద్వీపసమూహం లోని అతిపెద్ద ద్వీపం డియాగో గార్షియాను యునైటెడు స్టేట్సుకు లీజుకు ఇచ్చింది. సముద్రతీర పర్యాటకులకు, మాధ్యమం, మునుపటి నివాసులకు చాగో ద్వీపసమూహంలో ప్రవేశించడం నిషేధించబడింది. మారిషస్ ఫ్రెంచి నుండి ట్రొమెలిన్ ద్వీపం మీద సార్వభౌమాధికారాన్ని పొందింది.
మారిషస్ ప్రజలలో బహుళ సప్రదాయాలు, బహుళ మతాలు, బహుళ సంస్కృతులు, బహుళ భాషలకు చెందిన ప్రజలు ఉన్నారు. ద్వీపదేశప్రభుత్వం " వెస్టు మినిస్టరు పార్లమెంటరీ సిస్టం " విధానంలో రూపొందించబడింది. మారిషస్ ప్రజాపాలన, ఆర్ధికం, రాజకీయ స్వాతంత్రాలు అత్యున్నత స్థాయిలో ఉన్నట్లు వర్గీకరించబడింది. ఆఫ్రికాదేశాల మానవాభివృద్ధి జాబితాలో మారిషస్ ద్వితీయస్థానంలో ఉంది. మాస్కరెనె ద్వీపాలతో మారిషస్ జంతుజాలం, వృక్షజాలం (అనేక అంతరించి పోతున్న జాతులతో) ప్రత్యేక గుర్తింపు పొందుతూ ఉంది.హిందూయిజం అతిపెద్ద మతంగా ఉన్న ఏకైక ఆఫ్రికాదేశంగా మారిషస్‌కు ప్రత్యేకత ఉంది. ప్రభుత్వం ఆంగ్లభాషను ప్రధానభాషగా ఉపయోగిస్తుంది.