ముంగేర్
బీహార్ రాష్ట్రం లోని పట్టణం From Wikipedia, the free encyclopedia
బీహార్ రాష్ట్రం లోని పట్టణం From Wikipedia, the free encyclopedia
ముంగేర్, బీహార్ రాష్ట్రం ముంగేర్ జిల్లా లోని పట్టణం. [4] ఇది ముంగేర్ జిల్లా ముఖ్యపట్టణం, ముంగేర్ డివిజనుకు పరిపాలనా ప్రధాన కార్యాలయం. ముంగేర్, జమాల్పూర్ అనే రెండు పట్టణాలను కలిపి జంట పట్టణాలుగా పిలుస్తారు. జనాభా ప్రకారం ముంగేర్, బీహార్ లోని పట్టణాల్లో 11 వ స్థానంలో ఉంది. [5]
ముంగేర్ | |
---|---|
Coordinates: 25.381°N 86.465°E | |
దేశం | India |
రాష్ట్రం | Bihar |
జిల్లా | ముంగేర్ |
విస్తీర్ణం | |
• Total | 17 కి.మీ2 (7 చ. మై) |
Elevation | 43 మీ (141 అ.) |
జనాభా (2011)[2] | |
• Total | 2,13,101 |
• జనసాంద్రత | 13,000/కి.మీ2 (32,000/చ. మై.) |
భాష | |
• అధికారిక | హిందీ[3] |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 811201 to 811214 , 813201 |
టెలిఫోన్ కోడ్ | +91-6344 |
Vehicle registration | BR-08 |
చారిత్రికంగా, ముంగేర్ ఒక ప్రాచీన రాజధానీ నగరంగా ప్రసిద్ది చెందింది. ఇది గంగా నదికి దక్షిణపు ఒడ్డున ఉంది. [6] ఇది భాగల్పూర్కు పశ్చిమాన 60 కి.మీ., రాజధాని నగరం పాట్నాకు తూర్పున 180 కి.మీ. దూరంలో ఉంది.
2011 జనాభా లెక్కల ప్రకారం ముంగేర్ మునిసిపల్ కార్పొరేషన్ మొత్తం జనాభా 2,13,101. అందులో 1,13,173 మంది పురుషులు, 99,928 మంది మహిళలు ఉన్నారు. లింగ నిష్పత్తి 883 గా ఉంది. ఆరేళ్ళ లోపు పిల్లల సంఖ్య 29,260. ఏడేళ్ళకు పైబడినవారిలో అక్షరాస్యత 81.83 శాతంగా ఉంది. [7]
ముంగేర్‌లో జమాల్పూర్ జంక్షన్, ముంగేర్ రైల్వే స్టేషన్ అనే రెండు రైల్వే స్టేషన్లు ఉన్నాయి. మొదటిది నగరానికి ప్రధాన స్టేషను. రెండవ దాన్ని గతంలో పూరబ్సరాయ్ రైల్వే స్టేషన్ అనేవారు. ఇది సబర్బన్ స్టేషనుగా పనిచేస్తుంది. ఈ స్టేషన్లు సాహిబ్‌గంజ్ లూప్‌తో అనుసంధానించబడి ఉన్నాయి.
ముంగేర్ వివిధ జాతీయ, రాష్ట్ర రహదారుల ద్వారా భారతదేశంలోని ప్రధాన ప్రాంతాలకు అనుసంధానించబడి ఉంది. ఎన్‌హెచ్ 33 , ఎన్‌హెచ్ 80, ఎన్‌హెచ్ 333, ఇతర రాష్ట్ర రహదారుల ద్వారా పాట్నా, రాంచీ, భాగల్పూర్, పూర్ణియా, బీహార్ షరీఫ్, ముజఫర్‌పూర్, జంషెడ్పూర్, ధన్‌బాద్, గయ, బోకారో, దర్భాంగా వంటి బీహార్, జార్ఖండ్ రాష్ట్ర ప్రధాన నగరాలను చేరుకోవచ్చు. అన్ని ప్రధాన నగరాలకు, ఇతర గమ్యస్థానాలకూ బిఎస్ఆర్టిసి రెగ్యులర్ బస్సు సేవలను అందిస్తుంది. సిటీబస్సులు, టాక్సీలు, ఆటోరిక్షా, ఇ-రిక్షా మొదలైనవి మొత్తం నగరంలో రవాణా కోసం అందుబాటులో ఉన్నాయి.
ముంగేర్ విమానాశ్రయం ముంగేర్ నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న సఫియాబాద్లో ఉంది. [9] [10] వాణిజ్య సేవలు అందించే దేశీయ విమానాశ్రయం 180 కి.మీ. దూరం లోని పాట్నాలో ఉంది. సమీప అంతర్జాతీయ విమానాశ్రయం నేతాజీ సుభాష్ చంద్ర బోస్ అంతర్జాతీయ విమానాశ్రయం లో కోలకతా (480 కి.మీ.) లో ఉంది.
ముంగేర్ వాతావరణం ఉపఉష్ణమండల (వేసవిలో వేడిగాను, శీతాకాలంలో చల్లగానూ ఉంటుంది). దీన్ని కొప్పెన్ వాతావరణ వర్గీకరణలో తేమతో కూడిన ఉపఉష్ణమండల శీతోష్ణస్థితిగా వర్గీకరించారు.
శీతోష్ణస్థితి డేటా - Munger, India | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నెల | జన | ఫిబ్ర | మార్చి | ఏప్రి | మే | జూన్ | జూలై | ఆగ | సెప్టెం | అక్టో | నవం | డిసెం | సంవత్సరం |
సగటు అధిక °C (°F) | 23.5 (74.3) |
26.4 (79.6) |
32.5 (90.5) |
37.0 (98.6) |
37.9 (100.3) |
35.5 (95.9) |
31.9 (89.4) |
31.2 (88.1) |
31.5 (88.7) |
30.8 (87.5) |
27.7 (81.9) |
24.2 (75.6) |
30.8 (87.5) |
సగటు అల్ప °C (°F) | 9.4 (48.9) |
11.9 (53.4) |
16.9 (62.4) |
21.8 (71.3) |
24.6 (76.3) |
25.4 (77.7) |
24.9 (76.8) |
24.8 (76.6) |
24.2 (75.5) |
20.9 (69.7) |
14.4 (57.9) |
10 (50) |
19.1 (66.4) |
సగటు అవపాతం mm (inches) | 15 (0.6) |
18 (0.7) |
13 (0.5) |
13 (0.5) |
41 (1.6) |
170 (6.8) |
300 (11.7) |
280 (11) |
230 (8.9) |
81 (3.2) |
5.1 (0.2) |
2.5 (0.1) |
1,160 (45.7) |
Source: weatherbase[11] |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.