మూర్స్ సూత్రం
From Wikipedia, the free encyclopedia
మూర్స్ సూత్ర పరిశీలనలో కంప్యూటింగ్ హార్డ్‌వేర్ చరిత్రన ఒక ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ యందు ట్రాన్సిస్టర్ల సంఖ్య సుమారు ప్రతి రెండు సంవత్సరాలకు రెట్టింపు అవుత్తుంది. ఈ సూత్రానికి ఇంటెల్ కార్పొరేషన్ సహ వ్యవస్థాపకుడు గోర్డాన్ E. మోర్ పేరు పెట్టారు. ప్రస్తుతం సెమీకండక్టర్ పరిశ్రమలో దీర్ఘకాల ప్రణాళిక మార్గదర్శకత్వం, పరిశోధన, అభివృద్ధి కోసం మూర్స్ సూత్రాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ సూత్రం కచ్చితమైనదిగా నిరూపించబడింది. మూర్స్ సూత్రం 20 వ, 21 వ శతాబ్దాలలో సాంకేతిక, సామాజిక మార్పును వివరించింది.
ఈ ధోరణి అర్థ శతాబ్దంపాటు కొనసాగినప్పటికీ, మూర్ సూత్రం ఒక పరిశీలన లేదా ప్రతిపాదననుగా పరిగణించాలి కాని ఒక భౌతిక లేదా సహజ చట్టంగా పరిగణించకూడదు. ఈ సూత్రం కనీసం 2015 లేదా 2020 వరకు కొనసాగుతుందని భావిస్తున్నారు. అయితే, సెమి కండక్టర్ కోసం ఇంటర్నేషనల్ టెక్నాలజీ వారి 2010 రోడ్‌మ్యాప్ నవీకరణ ప్రకారం 2013 చివరిలో ఈ వృద్ధి నెమ్మదిగా తగ్గవచని అంచనా. ప్రతి మూడు సంవత్సరాలకు రెటింపు అవుత్తుంది.