యూరీ ఒగనేసియన్
From Wikipedia, the free encyclopedia
యూరీ త్సోలంకోవిచ్ ఒగనేసియన్ (జ.1933 ఏప్రిల్ 14) రష్యా దేశానికి చెందిన కేంద్రక భౌతిక శాస్త్రవేత్త. అతడు ఆర్మేనియన్ సంతతికి చెందినవాడు. అతడు అధిక భారం గల రసాయన మూలకాల ఆవిష్కరణ కొరకు ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకునిగా ఖ్యాతి పొందాడు. [1] అతడు ఆవర్తన పట్టికలో ఈ మూలకాల యొక్క ఆవిష్కరణకు దోహదపడ్డాడు. [2][3] అతడు 1989లో జాయింట్ ఇనిస్టిట్యూట్ ఫర్ నూక్లియర్ రీసెర్చ్ వద్ద ఫ్లెరోవ్ లేబొరేటరీ ఆఫ్ నూక్లియర్ రియాక్షన్స్ యొక్క డైరక్టరు "జార్జీ ఫ్లెరో" తో కలసి భారలోహ ఆవిష్కరణలో విజయం సాధించాడు. రసాయన మూలకం ఒగానెస్సాన్ (Og, పరమాణు సంఖ్య 118) కు 2016లో అతడిపేరుతొ నామకరణం చేసారు. ఒక మూలకానికి బ్రతికున్నవారి పేరుతో నామకరణం చేసిన వారిలో ఒకనిగా గుర్తింపబడ్డాడు.
త్వరిత వాస్తవాలు యూరీ అగనేసియన్, జననం ...
యూరీ అగనేసియన్ | |
---|---|
జననం | (1933-04-14) 1933 ఏప్రిల్ 14 (వయసు 91) రోస్టోవ్-ఆన్-డాన్, రష్యన్ సోవియట్ ఫెడెరేటివ్ సోషలిస్ట్ రిపబ్లిక్, సోవియట్ యూనియన్ |
జాతీయత | రష్యన్-ఆర్మేనియన్ |
రంగములు | కేంద్రక భౌతిక శాస్త్రం |
వృత్తిసంస్థలు | ఫ్లోరోవ్ లేబొరేటరీ ఆఫ్ నూక్లియర్ రియాక్షన్స్ |
చదువుకున్న సంస్థలు | మాస్కో ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఇనిస్టిట్యూట్ |
ప్రసిద్ధి | ఆవర్తన పట్టిలలో భారమూలకమైన ఒగానెస్సాన్ కు సహ ఆవిష్కర్త. దీనికి అతని పేరుతో నామకరణం చేసారు. |
మూసివేయి